Begin typing your search above and press return to search.
టీ అసెంబ్లీ సమావేశాల మీదా కరోనా ఎఫెక్ట్?
By: Tupaki Desk | 15 March 2020 4:46 AM GMTకరోనా ప్రభావం.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల పడుతోంది. కరోనా వైరస్ ఇబ్బంది పెట్టే స్థాయిలో లేకున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాల్ని వరుస పెట్టి ప్రకటిస్తోంది. ఇప్పటికే స్కూళ్లు.. సినిమా థియేటర్లు.. మాల్స్ లాంటి వాటిని ఈ నెలాఖరు లోపు మూసివేస్తూ నిర్ణయం తీసుకోగా.. పబ్లిక్ ఫంక్షన్లు.. సభలు.. సమావేశాల మీద కూడా నిషేధాన్ని విధిస్తోంది.
ఇలా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా.. అసెంబ్లీ సమావేశాల్ని కూడా కుదించాలని భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై వరకూ టీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే.. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఆది.. సోమవారాల్లో మాత్రమే సభను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన వినతిని సభాపతిని కోరనుంది.
అసెంబ్లీ సమావేశాల్ని కుదించాలన్న నేపథ్యంలో ఇవాళ.. రేపు రెండు రోజులు సభలో ప్రశ్నోత్తరాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. తర్వాత సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు.