Begin typing your search above and press return to search.
ప్రపంచానికి జరిగిన నష్టం ఎంత ఎక్కువంటే?
By: Tupaki Desk | 16 May 2020 4:15 AM GMTకంటికి కనిపించని మాయదారి రోగంతో ప్రపంచం ఎంతలా తల్లడిల్లుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు గడిచే కొద్దీ.. కొత్త కేసుల సంఖ్య పెరగటమే కాదు.. మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆర్థిక నష్టాన్నిఅంచనా వేస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే.. అంత భారీగా ప్రపంచానికి నష్టం వాటిల్లింది.
తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం దగ్గర దగ్గర రూ.435- 660 లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. ప్రపంచ జీడీపీలో ఈ విలువ 6.4 శాతం నుంచి 9.7 శాతం వరకు ఉందన్న అంచనాల్ని వేశారు. షాకింగ్ విషయం ఏమంటే.. ప్రపంచ బ్యాంకు లెక్కకట్టిన నష్టానికి మూడురెట్లు అధికంగా ఏడీబీ నివేదిక ఉండటం గమనార్హం.
మార్చి ఆరు నాటికి రూ.6 లక్షల కోట్ల నుంచి 26లక్షల కోట్ల వరకూ నష్టం వాటిల్లితే.. ఏప్రిల్ మూడు నాటికి ఇది కాస్తా రూ.150 నుంచి రూ.305 లక్షల కోట్ల మేర నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. ఈ నష్టం మే 15 నాటికి రూ.435 లక్షల కోట్ల నుంచి రూ.660 లక్షల కోట్ల మేర ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడున్న పరిస్థితులు మరో మూడు నెలల పాటు సాగితే ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థకు సుమారురూ.128లక్షల కోట్ల నష్టం వస్తుందని.. అదే ఆర్నెల్ల పాటు ఆంక్షలు నెలకొని ఉంటే ఈ మొత్తం రూ.185లక్షల కోట్ల మేర ఉంటుందని చెబుతున్నారు. మాయదారి రోగంతో చైనా ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టమే రూ.80 నుంచి రూ.120 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ అంకెల్ని చూస్తుంటే.. దిమ్మ తిరిగిపోవటం ఖాయం. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే శత్రువు ప్రపంచాన్ని ఎంత భారీగా దెబ్బ తీస్తున్నాడో కదా?