Begin typing your search above and press return to search.

దారుణ కోణం: కన్నీళ్లలోనూ కరోనా

By:  Tupaki Desk   |   26 April 2020 6:36 AM GMT
దారుణ కోణం: కన్నీళ్లలోనూ కరోనా
X
కష్టమొస్తే కన్నీళ్లు కారుస్తాం.. కరోనా నుంచి కాపాడు దేవుడా అని మొరపెట్టుకుంటాం.. కానీ ఆ కన్నీళ్లలో సైతం కరోనా ఉంటే.. ఇక అంతకంటే ఘోరం దారుణం.. అమానవీయం ఏముంటుంది. కన్నీళ్లలోకి సైతం కరోనా వచ్చిన దైన్యం ఇటలీ దేశంలో వెలుగుచూసింది. విస్మయం కలిగిస్తున్నా ఇది ముమ్మాటికీ నిజం.

ఇన్నాళ్లు లాలాజలం - ముక్కు చీమిడి - దగ్గు - ఉమ్మి నుంచి కరోనా వ్యాపిస్తుందని తేలింది. అయితే తాజాగా కన్నీళ్లతో కూడా కరోనా వ్యాపిస్తుందనే సంచలన విషయం వెలుగుచూసింది.

చైనాలోని వూహాన్ నుంచి ఇటలీ దేశానికి వెళ్లిన 65 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలు కనిపించాయి. దగ్గు - జలుబు - గొంతునొప్పి - జ్వరంతో పాటు కంటి నుంచి కన్నీళ్లు కారుతూనే కనిపించాయి. వీటిపై అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు ఆ కన్నీళ్లను తీసుకొని పరీక్షలకు ల్యాబ్ కు పంపారు. ఆ కన్నీళ్లలోనూ కరోనా వైరస్ ఉండడం శాస్త్రవేత్తలను విస్తుగొలిపింది.

ఇక కరోనా వైరస్ నుంచి బయటపడిన 21 రోజుల తర్వాత కూడా వైరస్ కళ్లలోనే ఉంటోందని పరిశోధనలో తేల్చారు. కరోనా నుంచి బయటపడ్డ 27వ రోజున టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఆమె కంటి నుంచి సేకరించిన శాంపిల్స్ లో కరోనా వైరస్ జీవించే ఉంది.

ఈ రిపోర్టును ప్రపంచ ఆరోగ్యసంస్థకు అందించడంతో తాజాగా కన్నీళ్లలో కరోనా వైరస్ చాలా రోజులు ఉంటుందనే విషయాన్ని తెలిపింది. ముక్కు - నోరు - కళ్లు కూడా కరోనా వాహకాలని తేల్చింది. దీంతో ఇక ఏడుపు నుంచి వచ్చే కన్నీళ్లు డేంజర్ అని అర్థమవుతోంది.