Begin typing your search above and press return to search.

మళ్లీ పని మొదలు.. హైదరాబాద్ ఐటీకి తొలగిన కరోనా భయం

By:  Tupaki Desk   |   10 March 2020 6:30 PM GMT
మళ్లీ పని మొదలు.. హైదరాబాద్ ఐటీకి తొలగిన కరోనా భయం
X
హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలో ఒక ఉద్యోగికి కరోనా సోకిందని ఆ కంపెనీ చేసిన తప్పుడు ప్రచారానికి ఐటీ ఉద్యోగులంతా హడలిపోయారు. వర్క్ ఫ్రం హోమ్ చేశారు. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం హడలిపోయింది. తాజాగా ఆ ఐటీ ఉద్యోగికి కరోనా లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వారం రోజుల క్రితం వరకూ ఐటీ ఇండస్ట్రీ కళకళలాడేది. కానీ మైండ్ స్పేస్ లోని ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకలేదని తేలడంతో ఐటీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. జాతీయ స్థాయిలోనూ ఐటీలో ప్రకంపనలు చెలరేగాయి. అయితే తాజాగా పరీక్షల్లో ఐటీ ఉద్యోగికి కరోనా సోకలేదని తేలడంతో వర్క్ ఫ్రం హోమ్ పని రద్దు అయ్యింది. కర్ఫూ విధించినట్టున్న ఐటీ ప్రాంతం తాజాగా కళకళలాడుతోంది. ఉద్యోగులు , ఐటీ జామర్స్ ఆఫీసులకు బయలుదేరారు.

కరోనా లేదన్న ధీమాతో అందరూ వచ్చేస్తున్నారు. దీంతో మైండ్ స్పేస్ లోని 20వ బిల్డింగ్ 9వ ఫ్లోర్ లోని మైండ్ స్పేస్ బిల్డింగ్ లో ఉద్యోగుల తాకిడి తాజాగా కనిపించింది.

అయితే కరోనా సోకిందంటూ మైండ్ స్పేస్ యాజమాన్యం అయిన డీఎస్ఎం కంపెనీ ప్రకటన చేయడం వల్ల హైదరాబాద్ ఐటీకి దెబ్బపడిందని.. ఇది ప్రతికూల ప్రభావం చూపిందని కొందరు ఉద్యగులు తప్పు పడుతున్నారు.పాజిటివ్ కాకముందే లేని భయాలను సృష్టించిన కంపెనీ ఉద్యోగులను మానసికంగా దెబ్బతీసిందని ఆడిపోసుకుంటున్నారు. తెలంగాఐ ఐటీ అసోసియేషన్ శాఖ సైతం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.