Begin typing your search above and press return to search.

మోడీ చెప్పిన 'కధా' ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి?

By:  Tupaki Desk   |   21 April 2020 12:30 AM GMT
మోడీ చెప్పిన కధా ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి?
X
జాతిని ఉద్దేశించిన ప్రసంగించే ప్రతిసారి ప్రధాని మోడీ ఒకట్రెండు కొత్త విషయాల్ని.. ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. స్ఫూర్తివంతమైన అంశాలతో పాటు.. తన వరకు వచ్చిన విషయాల్ని దేశ ప్రజలతో పంచుకోవటం తెలిసిందే. ప్రధాని స్థానంలో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలకు ఉండే విలువను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దీంతో.. ఆయా అంశాలకు వచ్చే ప్రాధాన్యత ఎంతో. ఇటీవల దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలోనూ కరోనాకు చెక్ పెట్టే అంశాల్ని ఆయన ప్రస్తావించారు.

కరోనా దరి చేరకుండా ఉండేందుకు లాక్ డౌన్ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించటం.. ఎవరి ఇళ్లల్లో వారు ఉండటంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించటం. ఇంట్లోనే ఉంటూ.. చిన్న చిట్కాలతో కరోనాకు దూరమయ్యే వాటికి గురించి చెబుతూ.. ‘కధా’ పానీయం తాగాలని ఆయన కోరారు. ఇంతకీ కధా పానీయం ఏమిటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అందులో ఏమేమి ఉండాలన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

‘‘కదా’’ పానీయాన్ని తయారు చేసుకోవటానికి కొంచెం తులసి ఆకులు.. యాలకులు.. దాల్చిన చెక్క.. శొంఠి.. నల్ల మిరియాలు (టేబుల్ స్పూన్).. ఎండుద్రాక్షలు (పది).. మూడు కప్పులు నీళ్లు.. కొద్దిగా నిమ్మరసం అవసరం. తొలుత నల్ల మిరియాలు.. దాల్చిన చెక్క.. శొంఠి.. యాలకుల్ని మొత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కిన తర్వాత ఈ పొడిని కలపలాలి. ఆ తర్వాత తులసి ఆకులు.. ఎండుద్రాక్షలు కూడా వేసి.. ఐదు నిమిషాలు తక్కువ మంటతో మరగించాలి.

చివరగా నిమ్మరసాన్ని పిండాలి. కాస్త రుచిగా ఉండేందుకు బెల్లం లేదంటే తేనెను కలుపుకోవచ్చు. అలా తయారు చేసే పానీయాన్ని రోజుకు ఒకట్రెండుసార్లు తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరగటమే కాదు.. అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేలా శరీరం శక్తివంతంగా మారుతుంది. సో.. కదాను తయారు చేసుకోవటానికి అవసరమైనవన్నీ ఇంట్లోనే ఉండే అవకాశం ఉన్నందున.. దీన్ని ట్రై చేయటం మంచిదే.