Begin typing your search above and press return to search.

దలాల్ స్ట్రీట్ నుండి కూరగాయల మార్కెట్ దాకా..కరోనా దెబ్బ

By:  Tupaki Desk   |   23 March 2020 5:01 PM GMT
దలాల్ స్ట్రీట్ నుండి కూరగాయల మార్కెట్ దాకా..కరోనా దెబ్బ
X
కరోనా ప్రపంచం గజగజలాడుతోంది. ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ఈ మహమ్మారి కారణంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరణాలు పదికి చేరుకున్నాయి. ఇది పెట్టుబడిదారుల నుండి సామాన్యుల వరకు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం అందరిపై ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫారన్ పోర్ట్‌ పోలియో ఇన్ వెస్ట్ మెంట్స్ (FPI)లు పెద్ద ఎత్తున వెనక్కి తీసుకున్నారు.

కేవలం మార్చి నెలలోనే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మార్చి 2వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు ఈక్విటీలలో రూ.56,247 వేల కోట్లు - డెట్ సెగ్మెంట్‌ లో రూ.52,449 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మొత్తంగా 1,08,697 కోట్ల పెట్టుబడులను విత్ డ్రా చేసుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల మార్కెట్లు దెబ్బతినడంతో పాటు సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు.

ప్రధాని మోడీ పిలుపుమేరకు ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సక్సెస్ అయింది. అయితే కరోనాను తరిమి కొట్టాలంటే మరికొన్ని రోజులు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో నిన్న కర్ఫ్యూ పాటించిన ప్రజలు.. ఈ రోజు (సోమవారం) పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. మార్చి 31వ తేదీ వరకు ఎమర్జెన్సీ సమయంలో తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు రావడంతో వారానికి సరిపడా కూరగాయలు - నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చారు.

ముఖ్యంగా కూరగాయల మార్కెట్లో జనాలు ఎఘబడ్డారు. గుంపులుగా ప్రభుత్వాలు చెబుతుంటే ఒకరినొకరు తోసుకున్న పరిస్థితులు కనిపించాయి. ఇదే అదనుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ధరలు రెండింతలు - మూడింతలు చేసి విక్రయించారు. హైదరాబాద్‌ లోని ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో అయితే జనాలు ఎత్తుకెళ్లారు. కూరగాయల కోసం జనాలు తోసుకున్నారు. ఆ సమయంలో కాస్త గలాటా కావడంతో ఎత్తుకెళ్లారు. మరోవైపు ఎక్కువ ధరకు విక్రయించిన పలు దుకాణాలను అధికారులు మూసివేయించారు.