Begin typing your search above and press return to search.
డేంజర్ బెల్స్... తెలంగాణలోకి కరోనా ప్రవేశించినట్టేనా?
By: Tupaki Desk | 1 Feb 2020 3:49 PM GMTఈ వార్త నిజంగానే తెలంగాణ ప్రజలతో పాటు ఏపీకి కూడా డేంజర్ బెల్స్ వినిపించేదే. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిందా? అన్న దిశగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వార్త నిజంగానే మనల్ని అలర్ట్ మోడ్ లోకి నెట్టేసిందని చెప్పక తప్పదు. చైనాలో పుట్టిన ఈ వైరస్... ఇప్పటికే మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయితే కేరళ మినహా ఇప్పటిదాకా మన దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోకి కరెనా వైరస్ ప్రవేశించిన దాఖలా లేదు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా వార్త ప్రకారం ప్రాణాంతక మహమ్మారిగా పరిగణిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలోకి ప్రవేశించిందా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.
ప్రాథమికంగా అందిన సమాచాం మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ దీనిపై ఓ సంచలన ప్రకటనను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ ప్రకటనలోని వివరాలు ఏమిటన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలతో 18 మంది ఆసుపత్రుల్లో చేరారట. ఈ 18 మందికీ పరీక్షలు నిర్వహించగా వారిలో 11 మందికి నెగెటివ్ అని నిర్ధరణ అయ్యిందట. మిగిలిన ఏడుగురికి సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు ఇంకా అందలేదట. అవి వస్తే తప్పించి ఈ ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డారా? లేదంటే... నెగెటివ్ గా తేలి ఊపిరి పీల్చుకున్న 11 మంది మాదిరి వీరు కూడా సేఫ్ సైడ్ లో ఉన్నారా? అన్నది తేలుతుంది.
అప్పటిదాకా.. అంటే ఈ ఏడుగురికి చెందిన వైద్య పరీక్షల ఫలితాలు వచ్చేదాకా టెన్షనేనన్న మాట. అయితే కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉన్న నేపథ్యంలో ఈ వైరస్ సోకినట్టు ఇంకా నిర్ధారణ కాకున్నా... ఈ ఏడుగిరి ఐసోలేషన్ లో పెట్టినట్టు, సోమవారం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్ అంటేనే జడిసిపోతున్న ప్రస్తుత తరుణంలో... ఈ వార్త అటు తెలంగాణ జనంతో పాటు ఇటే ఏపీ ప్రజలను కూడా తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందని మాత్రం చెప్పక తప్పదు.