Begin typing your search above and press return to search.
కరోనా ధాటికి కేరళ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 10 March 2020 11:45 AM GMTకరోనా ఎఫెక్ట్ కేరళ రాష్ట్రంలో మామూలుగా లేదు. అక్కడ జనాలు గుంపులుగా నిలబడడానికి భయపడుతున్నారు. కరోనా విజృంభణతో కేరళ అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజులుగా కేరళలో 6 కేసులు బయటపడగా.. మంగళవారం ఒక్కరోజే మరో ఆరు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
కరోనా ధాటికి కేరళ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నామని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది. ఈ మేరకు కేరళ సీఎం పినరయి విజయ్ ప్రకటన చేశారు. ఏడో తరగతి పైబడిన విద్యార్థుల పరీక్షలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.
ఈ నెల మొత్తం ప్రభుత్వ పరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా హాళ్లు, డ్రామా కంపెనీలు తెరవద్దని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు మాత్రమే జరపాలని.. అవి కూడా తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని అన్నారు. మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు.
ఇప్పటివరకూ కేరళ వ్యాప్తంగా దాదాపు 1116 కరోనా అనుమానితుల వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనుమానితుల్లో ఆరోగ్యవంతంగా పురోగతి సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.