Begin typing your search above and press return to search.
కరీంనగర్ లో ఇండోనేషియా ముస్లింలు... భయపడ్డంతా అయ్యింది
By: Tupaki Desk | 22 March 2020 11:30 AM GMTకరోనా కలకలం వేళ... వేరే పని నిమిత్తం మన దేశానికి వచ్చిన ఇండోనేషియా వాసుల విషయంలో నిజంగానే భయపడినంతా జరిగిపోయింది. దేశం కాని దేశం వచ్చిన సదరు ఇండోనేషియా ముస్లింలు మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా... ఇక్కడ మన దేశంలో అది కూడా మన తెలంగాణలోని కరీంనగర్ లో ఆశ్రయం ఇచ్చిన మన ముస్లిం సోదరుడు కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా ఇండోనేషియా ముస్లింలకు ఆశ్రయం ఇచ్చిన తాను పోలీసులకు చిక్కితే... ఏ రకమైన శిక్ష పడుతుందోన్న భయంతో తప్పించుకుని తిరుగుతున్న మన ముస్లిం సోదరుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి వైద్య చికిత్సలు ప్రారంభమయ్యాయి.
ఇండోనేషియా నుంచి నేరుగా కరీంనగర్ కు వచ్చిన ముస్లింలు... ఇక్కడ సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాలుపంచుకున్నారు. అసలు సీఏఏకు వ్యతిరేకంగా కరీంనగర్ లో జరిగిన నిరసనలు అన్నీ ఇండోనేషియా నుంచివచ్చిన ముస్లింల పర్యవేక్షణలోనే కొనసాగాయాన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా తమది కాని దేశానికి వచ్చిన ఇండోనేషియా ముస్లింలు కరీంనగర్ లో నిరసనలు నిర్వహించి దాదాపు గా ఉగ్రవాదుల కంటే కూడా పెద్ద నేరస్తులు గానే పరిణమించారు. అయితే ఇప్పుడు ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకారిగా పరిణమించిన కరోనా వైరస్ నేపథ్యంలో వారిని ఉగ్రవాదులుగా పరిగణించే అంశాన్నే అంతా మరిచిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు చేయించగా... అందరికీ కరోనా పాజిటివ్ అని తేలగా.. కరీంనగర్ వాసులతో పాటు యావత్తు తెలుగు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా... ఇండోనేషియా నుంచి మన దగ్గరకు వచ్చి కరోనాకు చిక్కిన సదరు ముస్లింల కారణంగా ఇక్కడి మనోళ్లు ఎంతమందికి కరోనా సోకిందన్న భయాలు ఓ రేంజిలో వినిపించాయి. అయితే కరీంనగర్ లో ఇండోనేషియా వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చిన కరీంనగర్ వాసి మహమ్మద్ జమీల్ అహ్మద్ కు మాత్రమే కరోనా సోకిందన్న వార్తలు కాస్తం త ఉపశమనం కలిగిస్తున్నా... జమీల్ రోజుల తరబడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగిన నేపథ్యంలో అతడి నుంచి ఎంతమందికి కరోనా సోకిందన్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇండోనేషియా బృందానికి బస ఏర్పాటు చేసిన జమీల్ అహ్మద్ కొన్ని రోజుల పాటు పోలీసులకు దొరకుండా తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరస్ సోకిందన్న అనుమానంతో వైద్య పరీక్షలుకు తరలించారు. మరోవైపు జమీల్‌పై అధికారులు ఆసుపత్రిలోనే విచారణ జరుపుతున్నారు.