Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్: తెలంగాణలో 6 మంది మృతి
By: Tupaki Desk | 31 March 2020 3:57 AM GMTఅర్థరాత్రి తెలంగాణ లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనా బాధితులు ఏకంగా ఆరు మృతిచెందారు. ఈ విషయం తెల్లవారు తెలుసుకున్న ప్రజలు షాక్‌కు గురయ్యారు. అర్థరాత్రి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా అప్పటికే ప్రజలు నిద్రలోకి జారుకోవడంతో తెల్లవారు లేచి వార్త పత్రికలు, టీవీల్లో చూసి అవాక్కయ్యారు. వాస్తవంగా సోమవారం సాయంత్రం దాక కరోనాతో ఒకరు మృతిచెందారని ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాతో కొందరు మృతిచెందారని సమాచారం ఆలస్యంగా ప్రభుత్వానికి సమాచారం చేరింది. దీంతో అర్థరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో భాగంగా ఐదుగురు మృతిచెందారని వెల్లడించింది. మార్చి 13వ తేదీ నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మర్కజ్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలంగాణ కు చెందిన ఆ మతస్తులు పాల్గొన్నారు. అక్కడకు వెళ్లిన వారిలో కరోనా సోకింది. ఆ సోకిన వారిలో ఆరుగురు మృతిచెందారు.
– హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి లో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
– హైదరాబాద్‌లోని అపొలో, గ్లోబల్ ఆస్పత్రుల్లో ఒకరు చొప్పున కరోనా పాజిటివ్ సోకిన వారు మృతిచెందారు.
– నిజామాబాద్, గద్వాలలో ఒక్కొక్కర మరణించారు.
ఇప్పటిదాక హైదరాబాద్ కు పరిమితమైన కరోనా ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ కు పాకింది. ఏకంగా కరోనా మృతులు చోటు చేసుకోవడంతో ఆ జిల్లాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ మరణాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ జిల్లాల పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు కూడా సోకిందేమో అనుమానంతో వారందరినీ అదుపులోకి తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా సోకుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎవరెవరు రాష్ట్రంలో ఉన్నారో ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రం నుంచి ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపింది.
ఈ సందర్భంగా మర్కజ్ కు వెళ్లిన వారిలో నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన 11 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 14మంది, వనపర్తి జిల్లాకు చెందిన 65 ఏళ్ల వ్యక్తులను గుర్తించారు. వెంటనే వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి సత్వర వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు.
అయితే ఒక్కసారిగా కరోనా మృతులు పెరగడం తో తెలంగాణలో అలజడి మొదలైంది. నిన్నటి దాక ఒక మృతే ఉండగా ఒక్కరోజే ఐదుగురు మృతిచెందడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూ కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.