Begin typing your search above and press return to search.
తెలంగాణ పోలీస్ శాఖకు కొత్త యాప్.. ఇట్టే కేసులు పెట్టేస్తారు
By: Tupaki Desk | 10 April 2020 5:00 AM GMTలాక్ డౌన్ వేళ.. నెత్తి నోరు కొట్టుకుంటున్నా సరే.. ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెప్పినా.. ఏదో ఒక కారణం చెప్పి బయటకు వచ్చేస్తున్న వారెంతోమంది. ఇలాంటివారికి చెక్ పెట్టేందుకు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఈ క్రమంలో ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు సరికొత్త యాప్ ను తీసుకొచ్చేశారు. దీంతో.. ఉల్లంఘనుల మీద కేసులు పెట్టేయనున్నారు.
లాక్ డౌన్ వేళ తెలంగాణలో నిత్యవసర వస్తువుల కొనుగోలుతో పాటు.. ఇతర అవసరాల కోసం తాము ఉండే ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా నిబంధనను తీసుకొచ్చారు. అయితే.. దీన్ని ఉల్లంఘిస్తూ.. ఎవరికి వారు రోడ్లకు మీదకు అదే పనిగా వచ్చేస్తున్నారు. దీంతో.. లాక్ డౌన్ స్ఫూర్తి దెబ్బ తింటోంది. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు సరికొత్త యాప్ ను తీసుకొచ్చారు.
దీని ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీదకు ఎక్కిన వెంటనే.. పోలసీులు తమ వద్ద ఉన్న పోన్లో ఆ వ్యక్తి పేరు.. వాహనం నెంబర్ తో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ ను నమోదు చేస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత.. సదరు వ్యక్తి పేరును.. వాహనం నెంబరును నమోదు చేస్తారు. దీంతో.. సదరు వ్యక్తి ఎంత దూరం ప్రయాణించారన్న విషయాన్ని జీపీఎస్ ద్వారా సదరు యాప్ సమాచారాన్ని ఇస్తుంది.
ఒకవేళ.. అందులో 3కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లు తేలితే.. వెంటనే అతడి మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే వందలాది మంది మూడు కి.మీ. నిబంధనను ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించారు. వారందరిపైనా కేసులు నమోదు చేయనున్నారు. సో.. బయటకు వెళ్లేముందు.. ఇలాంటివి గుర్తు పెట్టుకుంటే బెటర్.లేకుంటే లాక్ డౌన్ వేళ.. కేసుల తలనొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.