Begin typing your search above and press return to search.
అంతుచిక్కని కరోనా.? హైదరాబాద్ లో వీరికెలా సోకింది?
By: Tupaki Desk | 14 April 2020 2:12 PM GMTతెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు సంఖ్య తగ్గకపోగా విపరీతంగా పెరుగుతుండడం ఆందోళనకు దారితీస్తోంది. అత్యధిక కేసులు హైదరాబాద్ లోనే నమోదవుతుండడంతో ముఖ్య మంత్రి కేసీఆర్ దీనిపై ప్రధాన దృష్టి సారించారు.
అయితే తాజాగా హైదరాబాద్ అనూహ్యమైన కరోనా కేసులు వెలుగుచూస్తుండడం వైద్యవర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ లో నమోదైన రెండు కేసులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఈ రెండు కేసులకు మర్కజ్ తోకానీ.. విదేశీ ట్రావెల్ హిస్టరీ కానీ లేకపోవడం వైద్యవర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో హైదరాబాద్ లో ఇలాంటి మరెన్ని కేసులు ఉన్నాయోనని ర్యాపిడ్ టెస్టులకు మొగ్గుచూపుతున్నారు.
తాజాగా పాజిటివ్ గా తేలిన హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. కాళ్లు, చేతులు పనిచేయక ఇంటిలోనే ఉంటున్నాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. వీళ్లలో ఎవరికి బయట లింకులు లేవు. అయినా సరే పక్షవాతం సోకిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వైద్యులను షాక్ కు గురిచేసింది.
ఇక తాజాగా టౌలిచోకీకి చెందిన 8 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ చిన్నారి కుటుంబాలకు సేమ్ ఎవరితోనూ లింక్స్ లేవు. అయినా ఆమెకు కూడా కరోనా సోకింది.
తాజాగా కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకున్నా కానీ కరోనా సోకడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉంటారోనన్న భయం నెలకొంది. కొంతమందిలో లక్షణాలు బయటపడడంలేదు.వారు బయట తిరుగుతూ అంటించేస్తున్నారు. ఇలా ఎవరి ద్వారా వ్యాపిస్తుందో తెలియని కేసులు సామూహిక దశ అని ఇది చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.