Begin typing your search above and press return to search.

వికారాబాద్ వ్యక్తి చేసిన పనికి కేసులు ఎంత పెరిగాయంటే?

By:  Tupaki Desk   |   15 April 2020 4:00 AM GMT
వికారాబాద్ వ్యక్తి చేసిన పనికి కేసులు ఎంత పెరిగాయంటే?
X
ఒకరు చేసే తప్పు.. చుట్టూ ఉన్న వారెందరికో ముప్పుగా మారటమే కాదు.. అందుకు వ్యవస్థ సైతం భారీ మూల్యాన్ని చెల్లించాల్సిన దుస్థితి. కరోనా వేళ బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు.. అందుకు భిన్నంగా చేష్టలుడిగినట్లుగా ఉండిపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న రాక మానదు. కరోనా మహమ్మారిని లైట్ గా తీసుకోవటం.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా తనకు మాత్రం రాదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కొత్త సమస్యల్ని తీసుకొస్తుంది.

వికారాబాద్ కు చెందిన ఒక వ్యక్తి ఎపిసోడ్ దీనికి ఉదాహరణగా చెప్పక తప్పదు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ లో ఉండాలని.. ఎవరిని కలవకూడదని.. ఎవరికి వారుగా ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచించినా.. అందుకు తగిన స్పందన లభించలేదని చెబుతారు. కరోనా హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి వ్యవహరిస్తున్న తీరు అధికారులకు తల నొప్పిగా మారింద.

వికారాబాద్ కు చెందిన ఒక వ్యక్తి మర్కజ్ కు వెళ్లివచ్చాడు. ఇటీవల అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే.. మర్కజ్ కు వెళ్లి వచ్చిన తర్వాత హోం క్వారంటైన్ సూచనల్ని పట్టించుకోకుండా తెలిసిన వారిని.. సన్నిహితుల్ని అదే పనిగా కలిశారు. వికారాబాద్ లో పలువురిని కలిసిన ఆ వ్యక్తి ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించటంతో వైద్యుల్ని సంప్రదించగా.. అతడ్ని పరీక్షించి పాజిటివ్ గా తేల్చారు. దీంతో.. అతడి కాంటాక్టు ఎవరెవరన్న విషయాన్ని ఆరా తీస్తున్న పోలీసులకు.. ఇతగాడు కలిసిన వారి లిస్టు భారీగా ఉండటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తమవుతోంది.

హోం క్వారంటైన్ సూచనల్ని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వికారాబాద్ వ్యక్తి కారణంగా ఇప్పుడు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అవి మరిన్ని పెరుగుతాయన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడా వ్యక్తి ఎక్కడెక్కడ? ఎవరెవరిని కలిశారు? అన్నది తేల్చేందుకు పోలీసులు అధికారులుపడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావంటున్నారు. అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్న ప్రమాదాకర వైరస్ వ్యాప్తి పుణ్యమా అని పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నమాట వినిపిస్తోంది.