Begin typing your search above and press return to search.

షాకింగ్: ఒకే కుటుంబంలో 17 మందికి కరోనా ..ఎలా వ్యాపించిందంటే ?

By:  Tupaki Desk   |   15 April 2020 6:14 AM GMT
షాకింగ్: ఒకే కుటుంబంలో 17 మందికి కరోనా ..ఎలా వ్యాపించిందంటే ?
X

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకి మరింతగా విస్తరిస్తూ అందరిని భయంతో వణికిస్తుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మనదేశంలో ఈ వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇండియాలో ఇప్పటి వరకు 11 వేలకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇకపోతే మనదేశంలో కరోనా కట్టడిలోకి రావడంతో ..లాక్ డౌన్ గడువు కేంద్రం మే 3 వరకు పొడిగించింది.

అయితే , దేశంలో ఎంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇకపోతే , తెలంగాణలో ఈరోజు 52 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644 కి చేరింది. కాగా.. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. ఈ 17 మందిలో 10 నెలల శిశువు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ లోని తలాబ్ కట్టకు చెందిన ఓ మహిళ ఏప్రిల్ 10వ తేదీన ప్రైవేట్ హాస్పిటల్ లో గుండె సంబంధించిన హాస్పిటల్ లో మరణించింది. ఆమె లక్షణాలను బట్టి ఆమెకు కరోనా అని భావించి టెస్ట్ చేయగా ఏప్రిల్ 13 వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు .. ఆమెకు వైద్యం అందించిన వైద్యులకు, ఆమె కుటుంబసభ్యులు మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వెంటనే వారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 24 మందిని నిజామియా హాస్పిటల్ లో క్వారంటైన్ కు తరలించారు. అయితే , మరణించిన మహిళకి కరోనా ఎలా సోకిందో ఎవరికీ తెలియడం లేదు. దీనితో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ధికారులు దర్యాప్తు చేస్తున్నారు.