Begin typing your search above and press return to search.
షాక్.. నెగిటివ్ అని ఇంటికి పంపితే పాజిటివ్ అని తేలింది
By: Tupaki Desk | 16 April 2020 4:30 AM GMTమిగిలిన విషయాల్లో కాస్త తేడా ఉన్నా సర్దుకుపోవచ్చు. కానీ.. కరోనా విషయంలో అలాంటి మినహాయింపులు ఉండవు. చిన్న తప్పునకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి పరిణామమే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కరోనా అనుమానంతో అబిడ్స్ లోని కింగ్ కోఠి ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ విషయంలో వైద్యుల అంచనాలు తప్పు అయ్యాయి. దీంతో.. కొత్ భయాలు పట్టుకున్నాయి. పాతబస్తీకి చెందిన ఒక మహిళకు కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి.
ఈ నేపథ్యంలో కింగ్ కోఠి ఆసుపత్రికి వచ్చారు. ఆమెను చేర్చుకున్న వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తొలుత నిర్వహించిన పరీక్ష ఫలితాలు వారం తర్వాత కూడా రాలేదు. ఏప్రిల్ 12న వచ్చిన రిజల్ట్ లో ఆమెకు నెగిటివ్ గా తేలింది. దీంతో.. ఆమెను ఏప్రిల్ 14న ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేశారు. అయితే.. ఆమెకు సంబంధించిన మరో శాంపిల్ ను పరీక్షలు జరిపారు. సిత్రంగా అందులో ఫలితం పాజిటివ్ గా వచ్చింది.
దీంతో.. ఆందోళన చెందిన వైద్యులు హుటాహుటిన సదరు మహిళ ఇంటికి వెళ్లి.. ఆమెను గాంధీకి తరలించారు. ఈ నేపథ్యం లో ఆమెతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె కాంటాక్టు ఎవరెవరితో అయ్యారో ఆరా తీసి వారందరికి పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎపిసోడ్ లో సదరు మహిళ కారణంగా ఎంతమందికి వ్యాప్తి చెంది ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది?