Begin typing your search above and press return to search.

విశాఖలో కలవరం.. నలుగురు అనుమానితులు

By:  Tupaki Desk   |   14 March 2020 8:30 AM GMT
విశాఖలో కలవరం.. నలుగురు అనుమానితులు
X
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజురోజుకి ఈ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే నెల్లూరు ఒక అనుమానితుడు ఆస్పత్రిలో చేరగా.. ఇప్పుడు విశాఖపట్టణంలో కూడా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నలుగురు ఆస్పత్రిలో చేరారని సమాచారం. మొత్తం 16 కేసులు నమోదు కాగా 13 నెగెటివ్ గా తేలింది. వీరిలో ఇటలీకి చెందిన వ్యక్తికి నెగటివ్ నమోదు కాగా మిగతా ముగ్గురి రిపోర్టు రావాల్సి ఉంది.

అయితే ఈ సమాచారంతో విశాఖవాసుల్లో భయాందోళన మొదలైంది. కరోనా వైరస్ వ్యాపించందనే పుకార్లతో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు కరోనా భయంతో విశాఖపట్టణం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విశాఖపట్టణం- కౌలాలంపూర్ మధ్య ఎయిర్ ఏషియా విమానాలు రద్దు చేశారు. విశాఖపట్టణం-సింగపూర్ మద్య కూడా విమాన సర్వీసు రద్దు అయింది. దీంతో విమానాయానంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రజలు కూడా ప్రయాణాలు విరమించుకుంటున్నారు. ఈ కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్టణంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా

అనుమానితులకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భం గా విశాఖపట్టణం రైల్వే స్టేషన్ లో కరోనా హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. మాస్కులు ధరించాలని ఆటో డ్రైవర్లకు ఆదేశాలిచ్చారు. ఇక దేవాలయాల్లో కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సింహాచలం దేవాలయంలో భక్తులకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు.ఇప్పటికే నెల్లూరులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ జిల్లా యంత్రాంగమంతా ప్రత్యేక వార్డులో అతడికి వైద్యం అందిస్తున్నా విషయం తెలిసిందే. అయితే అతడికి సంబంధించిన 150 మందిని కరోనా వ్యాపించి ఉండవచ్చనే అనుమానంతో వైద్య శాఖ అధికారులు వారికి పరీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ వార్డులో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 18వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. నెల్లూరులో స్విమ్మింగ్ పూల్స్ మూసి వేయాలని నిర్ణయించారు. సముద్ర తీర ప్రాంతం, కృష్ణపట్నం పోర్ట్, శ్రీహరికోట రాకెట్ కేంద్రాలను అప్రమత్తం చేశారు.