Begin typing your search above and press return to search.
చరిత్రలో రాసేద్దామా.. సరికొత్త విశ్వవిజేత గురించి
By: Tupaki Desk | 1 April 2020 12:30 AM GMTఈ ప్రపంచాన్ని ఏలాలని కలలు కన్న వారెందరో. ఎన్నో దేశాలు. . మరెన్నోరాజ్యాలు.. ఎంతోమంది మహా వీరులు ఈ ప్రపంచానికి విశ్వవిజేతగా అవతరించాలని తపించారు. అందుకోసం తమ జీవితాల్ని పణంగా పెట్టటమే కాదు.. రక్తాన్ని ఏరులై పారేలా చేశారు. తమ యుద్ధ కాంక్షతో ప్రపంచాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని ఎత్తులు వేశారు. ఎవరెన్నిఎత్తులు వేసినా.. మరెన్నిప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. అంతా ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అయిన వారే.
ప్రపంచాన్ని జయించాలన్న కాంక్ష తీరకుండానే కాలం చేశారు. అలాంటిది.. ప్రపంచంలో ఇప్పటివరకూ మనిషి చేయలేని పనిని.. కంటికి కనిపించనంత చిన్న సూక్ష్మజీవి.. విశ్వవిజేతగా అవతరించారని చెప్పాలి. ప్రపంచంలోని ప్రతి భాగాన్ని టచ్ చేయటమే కాదు.. తాను అడుగు పెట్టిన ప్రతి దేశాన్ని తన అధీనంలోకి తీసుకోవటమే కాదు.. తన ప్రభావానికి లోనయ్యేలా చేయటం.. ఆగమాగం చేయటం తెలిసిందే.
ఇప్పటివరకూ ఉన్న అంచనా ప్రకారం దాదాపు 190 దేశాలకు పైనే విస్తరించిన కరోనా.. తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిత్యం కొత్త వారిలోకి ప్రవేశిస్తూ.. అడ్డూ ఆపు లేకుండా దూసుకెళ్లిపోతోంది. దాంతో పోరాడలేనోళ్లంతా అసువులు బాస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటివరకూ మరే వైరస్ కు దడిచి.. ప్రపంచానికి ప్రపంచమే లాక్ డౌన్ లాంటి కఠినమైన నిర్ణయాల్ని తీసుకునేలా చేయటంలో కరోనా సక్సెస్ అయ్యింది. ఇదంతా చూసినప్పుడు.. ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవటమేకాదు.. చుక్కలు చూపించాలన్న విషయంలో కరోనా సక్సెస్ అయ్యిందని చెప్పాలి. కాకుంటే.. ఒకే ఒక్క ఇబ్బంది. ప్రపంచానికి నయా విశ్వవిజేత కంటికి కూడా కనిపించనంత బుల్లి జీవి కావటం. మొనగాడనుకునే మనిషికి అంతకు మించిన అపజయం ఇంకేం ఉంటుంది చెప్పండి?