Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: లాక్ డౌన్ నుంచి ప్రజలకు స్వల్ప ఊరట

By:  Tupaki Desk   |   23 April 2020 1:13 PM GMT
బ్రేకింగ్: లాక్ డౌన్ నుంచి ప్రజలకు స్వల్ప ఊరట
X
లాక్ డౌన్ తో సర్వం బంద్ అయిపోయి జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే లాక్ డౌన్ తో జనాలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. క్షౌరశాలలు లేక గడ్డాలు - మీసాలు పెరుగుతున్నాయి. ఇక ఎండాకాలంలో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. కూలర్లు - ఫ్యాన్లు కొందామన్నా షాపులు లేవు. కనీసం రిపేర్ చేసుకోవడానికి ఎలక్టీషియన్ల షాపులు లేవు. ఇలా అన్నీ మూతపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులు - పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సడలింపులను ప్రకటించింది. ఈ మేరకు దేశ ప్రజలకు ఊరటనిచ్చింది.

ఈ లాక్ డౌన్ మినహాయింపులు కేవలం దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రమేనని కేంద్రం తెలిపింది. మొబైల్ రీచార్జ్ - సిమెంట్ - పుస్తకాల షాపులు వంటి వాటికి తాజాగా లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రెడ్ జోన్ - హాట్ స్పాట్ ప్రాంతాల్లో మాత్రం మినహాయింపులు ఉండవని అక్కడ స్టిక్ట్ గా అమలవుతాయని తెలిపింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆరోగ్యశాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇక కరోనాపై దేశవ్యాప్తంగా నోడల్ అధికారులను నియమిస్తున్నామన్నారు.

*కేంద్రం తాజాగా మినహాయింపులు ఇచ్చినవి ఇవే..

+ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు
+సిమెంట్‌ విక్రయాలకు అనుమతి
+రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
+పిండి మిల్లులకు లాక్‌ డౌన్ నుంచి మినహాయింపు
+మొబైల్‌ రిచార్జ్‌ షాపులు
+ పుస్తకాలు - స్టేషనరీ షాపులు
+నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు