Begin typing your search above and press return to search.
అమెరికన్లు మారరా? ఆ దేవుడే కాపాడాలి
By: Tupaki Desk | 20 April 2020 4:30 AM GMTనిజానికి అమెరికా సహా పాశ్చాత్య అభివృద్ధి చెందిన దేశాల వారికి కమిట్ మెంట్, క్రమశిక్షణ , రూల్స్ పాటించడం ఎక్కువ. అక్కడే ఎక్కువగా లాక్ డౌన్ అమలు కావాలి.. 130 కోట్ల మంది జనం..వివిధ జాతులు, మతాలు, భిన్న వర్గాలు, పేదరికం నిర్లక్ష్యం పీక్స్ లో ఉండే భారత్ వంటి దేశాల్లో అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి రూల్స్ పాటించాలని లాక్ డౌన్ చేయడం అంటే తలకు మించిన భారమనుకున్నారు.
కానీ ప్రధాని నరేంద్రమోడీ పిలుపునకు జాతి మొత్తం ఒక్కటైంది. ఇంటికే పరిమితమైంది. ఉద్యోగ, ఉపాధి అంతా వదిలేసి ఆర్థిక పరిస్థితులు లెక్కచేయకుండా కరోనా కట్టడిలో భాగస్వాములయ్యారు. అదే ఇటలీ, యూరప్ దేశాలు, తాజాగా అమెరికా లో మాత్రం లాక్ డౌన్ ఘోరంగా విఫలమవుతోంది.
అమెరికాలో తాజాగా రాష్ట్రాల్లో లాక్ డౌన్ వద్దు.. ఆర్థిక వ్యవస్థను వెంటనే ప్రారంభించాలని జనాలు రోడ్లెక్కుతున్నారు. ముఖానికి మాస్కులు.. రక్షణ చర్యలు లేకుండా లాక్ డౌన్ ఎత్తివేయాలని సామూహికంగా నిరసనలు తెలుపుతున్నారు. అమెరికాలో తుపాకులు చేతబూని సైతం జనాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. గివ్ మి లిబర్టీ, లైవ్ ఫ్రీ ఆర్ డై, వంటి నినాదాలతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నినదిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులకు అమెరికా కేంద్రంగా మారింది. మొత్తం కేసుల్లో 40శాతం అమెరికాలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే 40వేల మంది మరణించగా.. 8 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అమెరికా ప్రభుత్వం దీన్ని ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని పిలుస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే అందరూ ఇంట్లో కూర్చొని కరోనాకు రక్షణ చర్యలు చేపట్టాల్సింది పోయి చాలా మంది అమెరికన్లు నిర్లక్ష్యంగా లాక్ డౌన్ ఎత్తివేయాలని రోడ్డెక్కడం అందరికీ షాకింగ్ గా మారింది.
ఈ కరోనా క్లిష్ట సమయంలో కోట్ల మంది గల భారత్, చైనా సహా ఎన్నో దేశాలు ప్రాణాలకే విలువ ఇస్తున్నాయి. కానీ అమెరికన్లకు మాత్రం డబ్బులు, ఆర్థికం మీదే యావ ఉంది. ప్రాణాలు పోతున్నా వారిలో కించత్ మార్పు రావడం లేదు. నిరుద్యోగం, పేదరికం వస్తుందనే ఆందోళనలు అర్థమయ్యేలా ఉన్నప్పటికీ అసలు ప్రాణం పోతే డబ్బులు ఏం చేసుకోవాలి? లాక్ డౌన్ సహా ముందస్తు చర్యలు తీసుకోక మూల్యం చెల్లించుకున్న ప్రభుత్వాలు ఇప్పటికే పశ్చాత్తాపపడుతున్నా వేళ అమెరికన్ల తీరులో మార్పు మాత్రం రావడం లేదు. అమెరికన్ల తీరు ఇలానే సాగితే ఇక ఆ దేశాన్ని కరోనా నుంచి ఆ దేవుడే కాపాడాలనడంలో ఎలాంటి సందేహం లేదు.