Begin typing your search above and press return to search.

వచ్చే 30 రోజులు మనకి చాలా ముఖ్యం : ట్రంప్ !

By:  Tupaki Desk   |   31 March 2020 9:10 AM GMT
వచ్చే 30 రోజులు మనకి చాలా ముఖ్యం : ట్రంప్ !
X
ప్రపంచదేశాల ఆర్థికవ్యవస్థలపై కరోనా వైరస్ ప్రభావం గట్టిగానే పడింది. దీనికి అగ్రరాజ్యం ఏమీ మినహాయింపు కాదు. అమెరికా వ్యాపారాలపై కూడా కరోనా దెబ్బ గట్టిగానే ఉంది. ఇకపోతే ఇప్పటివరకు 1,63,000 మందికి కరోనా సోకగా ..మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది చేరింది. దేశంలో ఉన్న కరోనా పరిస్థితులపై అమెరికా అధినేత ..డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ..దేశంలో 10లక్షలమందికి పైగా ప్రజలకు కరోనా టెస్టులు నిర్వహించామని, అమెరికా చరిత్రలో ఇదో మైలురాయి అని తెలిపారు.

సామాజిక దూరానికి సంబంధించిన ఆంక్షలు, మార్గదర్శక సూత్రాలు, నిబంధనలను ఖఛ్చితంగా అమలు చేస్తామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికన్ ప్రజలందరూ వచ్ఛే ఏప్రిల్ నెల అంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, యూరప్ దేశాలతో ప్రయాణ సంబంధ ఆంక్షలు ఇంకా అమలులోనే ఉంటాయని ఆయన తెలిపారు. 10 మందికి మించి వ్యక్తులు గుంపులుగా గుమికూడరాదని, రెస్టారెంట్లు, బార్లలో డైనింగ్ వంటివాటికి స్వస్తి చెప్పాలని కోరుతున్నానని అన్నారు. ప్రతివారూ ఈ ఆంక్షలను పాటించాలని కోరారు.

అలాగే, వచ్చే 30 రోజులు మనకు చాలా కీలకం. ఇది మనకు ఓ సవాల్ అని , కరోనా నివారణకు పర్సనల్ ప్రొటెక్టివ్ సాధనాలను పొందేందుకు యత్నిస్తున్నామని, అలాగే మన దేశానికి అవసరం లేని సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన మెడికల్ పరికరాలను ఇటలీకి సరఫరా చేస్తున్నామని ట్రంప్ వివరించారు. కరోనా వైరస్ నివారణకు వైట్ హౌస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కో-ఆర్డినేటర్ దెబోరా బిర్క్స్ మాట్లాడుతూ.. అన్ని రాష్టాలూ కరోనా సమస్యను ఎదుర్కొంటున్నాయని, అందువల్ల ఫెడరల్ గైడెన్స్ చాలా కీలకం అని తెలిపారు.