Begin typing your search above and press return to search.
కొవిడ్.. ఇప్పుడు ప్రపంచానికే వణుకు
By: Tupaki Desk | 2 March 2020 9:30 PM GMTకంటికి కనిపించని కొవిడ్ వైరస్ ఇప్పుడు ప్రపంచానికి పెద్ద ప్రమాదంగా మారింది. చైనాలోని కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైందనుకున్న వైరస్.. క్రమక్రమంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన పరిస్థితి. మనుష్య సంచారం ఉండని ఆంటార్కిటికా తప్పించి అన్ని ఖండాలకు ఈ వైరస్ పాకింది. పశ్చిమాసియా.. యూరప్ లోని అనేక ప్రాంతాల్లోకి ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది.
మొన్నటివరకూ ఒకట్రెండు దేశాలకు సంబంధించిన సమస్య కాస్తా.. ఇప్పుడు ప్రపంచానికే పెను ప్రమాదంగా మారింది. తాజాగా ఈ వైరస్ కు చెందిన అప్డేట్స్ చూస్తే..
% ఇరాన్ లో గడిచిన 24 గంటల్లో 11 మంది కొవిడ్ బారిన పడి బలయ్యారు. దీంతో.. దీని కారణంగా మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. కొత్తగా 385 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. మొత్తంగా ఇప్పుడు కొవిడ్ అనుమానితులు ఇరాన్ లో 978 మందిగా చెబుతున్నారు.
% ఇరాన్ అధికారిక సమాచారానికి భిన్నంగా బీబీసీ సమాచారం ఉంది. ఆమీడియా సంస్థ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకూ కొవిడ్ వైరస్ సోకి ఆ దేశంలో 210 మంది మరణించినట్లుగా చెబుతున్నారు.
% ఇరాన్ సరిహద్దుకు అనుకొని ఉండే ఆర్మేనియా తన బోర్డర్ ను మూసేసింది. దుబాయ్ ఎమిరేట్స్ సంస్థ తమ సిబ్బందికి సెలవులు ఇచ్చింది. సెలవుల విషయంలో వారిష్టమని ప్రకటించింది. లక్ష మందికి పైనే ఆ సంస్థలో పని చేస్తున్నారు.
% కొవిడ్ తో వస్తున్న నష్టాలతో ఇప్పటికే వెయ్యి మంది సిబ్బందిని తొలగించాలని ఇజ్రాయిల్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది.
% పిశాచి వైరస్ భయంతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్ని వారం రోజుల పాటు మూసివేయాలని పాకిస్థాన్ నిర్ణయించింది. పాక్ లో ఇప్పటివరకూ కరోనా కారణంగా నలుగురు మరణించారు.
% దక్షిణ కొరియాలో కొత్తగా కొవిడ్ కేసులు 376 నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3526కు పెరిగాయి. 17 మంది మరణించారు.
% కొవిడ్ బాధితులు 90 శాతం మంది డేగు ప్రాంతానికి చెందిన వారే కావటం గమనార్హం. కొవిడ్ భయంతో దక్షిణ కొరియాలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల్ని చాలా సింఫుల్ గా పూర్తి చేశారు.
% కొవిడ్ కారణంగా అమెరికా.. థాయ్ లాండ్.. ఆస్ట్రేలియాలో కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 50 ఏళ్ల వ్యక్తి కొవిడ్ వైరస్ కారణంగా మరణించినట్లుగా అమెరికా ప్రకటించింది. ఈ వైరస్ కు అమెరికన్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాటను అధ్యక్షుడు ట్రంప్ ధైర్యం చెప్పారు.
% థాయ్ లో 35 ఏళ్ల వ్యక్తి కొవిడ్ కారణంగా మరణించగా.. వైరస్ కు ముందు డెంగీ జ్వరంతో బాధ పడినట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆ దేశంలో ఇప్పటివరకూ 42 కేసుల్ని గుర్తించారు.
% జపాన్ లో డైమండ్ ప్రిన్సెస్ ఓడ నుంచి తరలించిన 78 ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియాలోని పెర్త్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇటలీలో కొవిడ్ కారణంగా ఇప్పటివరకూ 29 మంది మరణించారు. మొత్తంగా ఆ చిన్న దేశంలో 1,128 కేసుల్ని గుర్తించారు.
% ఇటలీలో కొవిడ్ వైరస్ వెలుగు చూసిన తర్వాత యూరప్ వ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడిన దేశాల్లో డెన్మార్క్.. రొమేనియా.. గ్రీస్.. స్విట్జర్లాండ్.. ఆస్ట్రియా తదితర దేశాలు ఉన్నాయి.
% దక్షిణ అమెరికా లోని బ్రెజిల్ లో కొవిడ్ కేసు నమోదైంది. ఈక్వెడార్ లోనూ మొదటి కేసు నమోదైంది. పశ్చిమాసియాలోని పది దేశాల్లో వైరస్ పాకటం మొదలైంది. దీంతో.. జనం ఎక్కువగా హాజరయ్యే కార్యక్రమాల్ని రద్దు చేస్తున్నారు.