Begin typing your search above and press return to search.
అయ్యో అనుకునేలా భారత్ లో ఇటలీ జంట పెళ్లి రద్దు
By: Tupaki Desk | 9 March 2020 4:41 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్ల పాటు వారిద్దరూ సహజీవనం చేశారు. ఎట్టకేలకు వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వివాహ బంధాన్ని హిందూ సంప్రదాయం ప్రకారం చేపట్టాలని భావించారు. ఇందులో భాగంగా ఇండియాకు వచ్చిన ఈ జంట.. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 7న వారి వివాహం జైపూర్ లో జరగాల్సి ఉంది.
వారి వివాహం అనూహ్యంగా ఆగిపోయింది. దీనికి కారణం.. కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికించే ఈ మహమ్మారి కారణంగా వారిద్దరూ పెళ్లి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల రాజస్తాన్ ను సందర్శించిన ఇటలీ పర్యాటకుల్లో పలువురికి కరోనా లక్షణాలు కనిపించటంతో కేంద్రం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. ఆ వెంటనే.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటలీ పర్యాటకుల్ని వెంటనే ఢిల్లీకి వచ్చి ఇటలీ రాయబార కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.
దీంతో.. చేసుకుంటున్న పెళ్లిని వాయిదా వేసుకొని పరుగులు పెడుతూ ఢిల్లీకి చేరుకుందీ జంట. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవటమే కాదు.. 150 మందికి భోజనాలు కూడా సిద్ధం చేశారు. పెళ్లి కోసం.. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవటానికి గత ఏడాది బికనీర్ కు వచ్చి పెళ్లికి సంబంధించి పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఇలా పెళ్లి ఆగిపోవటంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇంతకీ పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తెల వయసు ఎంతో తెలుసా? జస్ట్ 56.. 50 ఏళ్లు మాత్రమే.