Begin typing your search above and press return to search.

కరోనాను వదలని కల్తీ దందారాయుళ్లు

By:  Tupaki Desk   |   17 March 2020 5:00 AM GMT
కరోనాను వదలని కల్తీ దందారాయుళ్లు
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయంతో జనాలు బిక్కు బిక్కుమంటున్నారు. గత రెండు మూడు వారాలుగా ఇండియాలో కూడా కరోనా కల్లోలం కనిపిస్తుంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో మొత్తం విద్యా సంస్థలను మరియు థియేటర్స్‌ ఇంకా మాల్స్‌ ను మూసేయించారు. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి అయినా చేతులను సబ్బుతో లేదా శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కోవాలంటూ ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో మెడికల్‌ షాప్‌ యాజమానులు ఇంకా కొందరు కల్తీ రాయుళ్లు తమ హస్తవాటం చూపిస్తున్నారు. కొన్ని కంపెనీలు తమ డేట్‌ అయిపోయి రిటర్న్‌ వచ్చిన శానిటైజర్స్‌ ను తిరిగి డేట్‌ మార్చి మెడికల్‌ షాప్స్‌ కు పంపిస్తున్నారు. ఈ విషయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో వెలుగులోకి వచ్చింది. డేట్‌ అయిపోయిన శానిటైజర్స్‌ ను మళ్లీ మార్కెట్‌ లోకి పంపిన కంపెనీ పై చర్యలకు పోలీసులు సిద్దం అయ్యారు.

ఇదే సమయంలో నకిలీ శానిటైజర్స్‌ కూడా మార్కెట్‌ ను ముంచెత్తుతున్నాయి. శానిటైజర్స్‌ కు డిమాండ్‌ విపరీతంగా పెరిగిన కారణంగా కల్తీకి అవకాశం పెరిగింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం అని తెలిసినా కూడా కల్తీ రాయుళ్లు మాత్రం కరోనాను కూడా వదలకుండా తమ అవసరానికి వియోగించుకుని డబ్బు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం 25 శాతం కూడా పని చేయని శానిటైజర్స్‌ ను తయారు చేసి బ్రాండెడ్‌ స్టిక్కర్స్‌ వేసి మెడికల్‌ షాప్స్‌ కు సప్లై చేస్తున్నారట. తాజాగా మహారాష్ట్ర లో నకిలీ శానిటైజర్స్‌ బాటిల్స్‌ ను సీజ్‌ చేయడం జరిగింది. దాదాపుగా 60 లక్షల విలువ చేసే డేట్‌ దాటిన మరియు నకిలీ శానిటైజర్స్‌ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.