Begin typing your search above and press return to search.
ఎందుకీ నిర్లక్ష్యం..గ్లౌజుల్లేకుండానే కరోనా రోగుల తరలింపా?
By: Tupaki Desk | 15 April 2020 7:10 AM GMTకరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి వేగంగా విస్తరిస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా దేశంలో పెరిగిపోతున్నాయి. దీనితో తొలిదశ లాక్ డౌన్ గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ గడువును కేంద్రం మే 3 వరకు పొడిగించింది. లాక్ డౌన్ వల్ల అనేకమంది ఇబ్బందులు పడుతున్నా కూడా , మరోదారి లేక లాక్ డౌన్ పొడగింపుకే కేంద్రం మొగ్గుచూపింది. అయితే, డాక్టర్లు - పోలీసులు - శానిటైజేర్ సిబ్బంది .. సంబంధిత అధికారులు ప్రాణాలని పనంగా పెట్టి కరోనా పై యుద్ధం చేస్తున్నారు.
ఈ కరోనాను అడ్డుకోవాలంటే సామజిక దురంతో పాటుగా ..తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. బయటకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ఇప్పటికే చాలా ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ ఫోటో తెలంగాణ రాష్ట్రంలో పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఉస్మానియా హాస్పిటల్ వద్ద తీసినదిగా సమాచారం. ఆ ఫొటోలో ...కరోనా రోగులని సిబ్బంది కనీసం చేతికి గ్లౌజులు కూడా వేసుకోకుండా తరలిస్తున్నారు.
మంగళవారం ఇద్దరికి వైరస్ సోకినట్లు తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు సిద్ధం చేశారు. సిబ్బంది గ్లౌజులు వేసుకోకుండానే రోగులను అంబులెన్సు వద్దకు తీసుకొచ్చారు. హెల్త్ ఇన్ స్పెక్టర్ కూడా పక్కనే ఉన్నా కూడా నిర్లక్ష్యం వహించారు. సిబ్బంది గ్లౌజులు లేకుండా కరోనా రోగిని తాకి మళ్లీ విధుల్లోకి వస్తుండటంతో మిగిలిన సిబ్బందికి కూడా కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే , తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా మాస్కులు ,కిట్లు సప్లై చేస్తున్నా కూడా సిబ్బంది వాటిని సరిగ్గా ఉపయోగించేలా చేయడంలో సంబంధిత అధికారులు విఫలం అవుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం పై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు.