Begin typing your search above and press return to search.
కరీంనగర్ ఇప్పుడెలా ఉంది?
By: Tupaki Desk | 20 March 2020 2:58 AM GMTమత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి వచ్చిన ఒక టీంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలటం.. వారంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన వైనం బయటకు రావటం.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ కు గురి కావటం తెలిసిందే. ఇండోనేషియాకు చెందిన వారు కరోనా పాజిటివ్ అని తేలిన వేళ.. ఉమ్మడి కరీంనగర్ ఉలిక్కిపడింది. వారంతా పట్టణంలో తిరగటం.. పలు ప్రాంతాల్లో పలువురిని కలిసిన నేపథ్యంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తమకు ఏమైనా కరోనా సోకిందన్న ఆందోళనకు పలువురు గురయ్యారు.
దీంతో.. కరీంనగర్ పట్టణమంతా అప్రకటిత కర్ఫ్యూ విధించినట్లుగా మారిపోయింది. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోవటమే కాదు.. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో వంద ప్రత్యేక టీంలు ఇండోనేషియన్లు తిరిగి ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి.. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఎవరికైనా జలుబు.. దగ్గు.. జ్వరం లాంటివి ఉన్నాయా? అన్న విషయాల్ని తెలుసుకున్నారు. అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఉండి.. పలువురికి ధైర్యం చెప్పారు. తామంతా ఉన్నామన్న భరోసాను ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. గురువారం కరీంనగర్ కు చెందిన 48 మంది అనుమానితులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వారిని పరీక్షలు జరిపిన వైద్యులు.. ఇద్దరు అనుమానితుల్ని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు చెందినవారిని కూడా హైదరాబాద్ కు పంపారు.
ఇండోనేషియా నుంచి వచ్చి కరోనా పాజిటివ్ అని తేలిన వారు.. కరీంనగర్ పట్టణంలో యాభై గంటలకు పైగా ఉండటంతో వారు ఏయే ప్రాంతాలకు వెళ్లారన్న అంశంపై ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీశారు. ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న సీసీ ఫుటేజ్ ను గుర్తించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వారు.. నేరుగా అక్కడకు సమీపంలోని ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లిన వైనాన్ని గుర్తించాచు. అక్కడే కొన్ని గంటలు ఉన్న వారు తర్వాత సెవన్ సీటర్ ఆటోలో కరీంనగర్ కు చేరుకున్నట్లు తేల్చారు. ఈ సందర్భంగా వారిని తీసుకెళ్లిన ఆటోను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది.