Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: తిరుమలపై టీటీడీ కఠిన నిర్ణయం

By:  Tupaki Desk   |   11 March 2020 12:00 PM GMT
కరోనా ఎఫెక్ట్: తిరుమలపై టీటీడీ కఠిన నిర్ణయం
X
చైనాలో పుట్టి ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ తప్పిపోయి తిరుమలకు వస్తే మాత్రం పెద్ద ఉపద్రవమే వాటిల్లనుంది. ఎందుకంటే రోజూ లక్షల మంది స్వామి వారి దర్శనానికి వస్తుంటారు. తిరుమల అంతటా జనసంచారమే కనిపిస్తుంటుంది. అలాంటి చోటులో కరోనా వ్యాపిస్తే విలయతాండవమే. అందుకే తాజాగా ఈ పెద్ద ప్రమాదం నుంచి తిరుమలను బయటపడేసేందుకు టీటీడీ కఠిన నిర్ణయం తీసుకుంది.

కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడం.. తెలంగాణకు పాకడం తో విదేశీ భక్తులు, ఎన్నారైలు భారత్ కు వచ్చిన 28న రోజుల తర్వాతే తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇండియాకు రాగానే తిరుమలకు రావద్దని సూచించింది. ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని.. కరోనా ప్రభలకుండా విదేశీ, ఎన్నారై భక్తులు తిరుమలకు రావద్దని రోగ లక్షణాలున్న స్థానికులు కూడా రావద్దని టీటీడీ కోరింది.

ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో వీఐపీ దర్శనాలకు టీటీడీ బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల కోడ్ నడుస్తోంది. టీటీడీకి కూడా ఇది వర్తిస్తుంది. అందుకే వీఐపీ దర్శనాల పేరిట వచ్చే భక్తుల దర్శనాలు చెల్లవని వారికి టీటీడీ బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోబోమని టీటీడీ తెలిపింది.