Begin typing your search above and press return to search.
షాకింగ్.. ఆ దేశంలో కరోనా వైరస్ అలా చేస్తుందట!
By: Tupaki Desk | 12 April 2020 6:02 AM GMTకరోనా వైరస్ మరింత క్లియర్ గా చెప్పాలంటే కోవిడ్ 19. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోని 190 దేశాల్లోకి వ్యాపించిన కరోనా వైరస్ ఒకేలా ఉండని వైనాన్ని ఇటీవలే గుర్తించారు. భారత్ లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కు ఉండే కొమ్ములు బలహీనంగా ఉండటాన్ని గుర్తిస్తే.. దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొద్ది రోజులకే తిరగబెడుతోంది. వైరస్ మూల సూత్రానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఈ వైనం ఇప్పుడు కొరకరాని కొయ్యలా మారుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా బ్రిటన్ లో విస్తరిస్తున్న కరోనా వైరస్ తనలోని మరో యాంగిల్ ను చూపిస్తోంది. ఈ దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారిని ఏ మాత్రం గుర్తించలేని రీతిలో దెబ్బేస్తోంది. కరోనా వైరస్ సోకినవారిలో ఆ లక్షణాలు కనిపించటం లేదు. అదే సమయంలో సదరు వ్యక్తిలోని అవయువాలు దెబ్బ తింటున్నాయి. బాగా ముదిరిన తర్వాత మాత్రమే కరోనా బయటకు రావటంతో మరణాలు సంఖ్య ఎక్కువ అవుతోంది.
కరోనా వైరస్ మీద పలు అధ్యయనాలు చేసిన వారు గతంలోనే ఒక అంశాన్ని గుర్తించారు. తనకున్న ప్రతికూలతల్ని సైతం అనుకూలంగా మార్చుకునే గుణం కోవిడ్ 19 సొంతం. ఉదాహరణకు బాగా వేడి ప్రాంతాల్లో మనలేని ఈ వైరస్.. కొంతకాలానికి ఆ ఇబ్బందిని అధిగమించేలా వ్యవహరిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. తాజాగా ఇలాంటి అంశమే ఒకటి బ్రిటన్ లో గుర్తించారు.
ఈ దేశంలో తొలుత వైరస్ ను గుర్తించినప్పుడు దీన్ని వెంటనే పసిగట్టే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు నిపుణులు. కరోనా వైరస్ అటాక్ చేసిన తర్వాత కూడా దాని లక్షణాలు కనిపించని పరిస్థితి. కానీ.. శరీరంలోని పలు అవయువాల్ని దెబ్బ తీసి.. ప్రాణాలు పోయేలా చేస్తుందన్న విషయాన్ని గుర్తించారు. మరే దేశంలో లేని విధంగా బ్రిటన్ లోని ఆసుపత్రుల్లో చేరే కరోనా పేషెంట్లలో 90 శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది. విపరీతమైన శ్వాసకోశ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పలువురికి వెంటిలేటర్లను ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇదంతా చూసిప్పుడు బ్రిటన్ లో విస్తరిస్తున్న కరోనా వైరస్ మరింత డేంజర్ అన్నది చెప్పక తప్పదు.