Begin typing your search above and press return to search.
కరోనా సోకితే అవయవాల ఫెయిల్యూర్
By: Tupaki Desk | 2 May 2020 2:30 AM GMTకరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఆ వైరస్ ప్రభావంపై పరిశోధనలు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా రోగుల్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు జరిగిన మరణాల్లో ఇవే అత్యధికంగా ఉన్నాయి. అయితే కరోనా సోకిన వారిలో కేవలం 15శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స, ఐసీయూ, ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్ అవసరం ఏర్పడుతుందని వైద్య నిపుణులు, అధికారులు గుర్తించారు.
అయితే కరోనా బారినపడుతున్న ప్రతీ ఆరుగురిలో ఒకరు తీవ్ర అనారోగ్యం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలు పరిశోధనల్లో తేలింది. అయితే యువతలో కరోనా ఉన్నా దాన్ని లక్షణాలు బయటపడడం లేదు. ఆరోగ్యవంతమైన యువతకు కరోనాతో పెద్ద ఇబ్బందేమీ లేదు. వారు ఆ వైరస్‌తో తీవ్రంగా పోరాడే శక్తి వారి శరీరంలో ఉంది. అయితే ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారికి మాత్రం దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి హైపోక్సియాకు దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే శరీరం ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని తెలెఇసింది. శ్వాస ప్రక్రియపై తీవ్రంగా కరోనా వైరస్ దాడి చేస్తుంది.
కరోనా వైరస్ లేదా SARS-CoV-2 సోకిన వ్యక్తి శరీరంలో కెమికల్ యాక్షన్ కారణంగా ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌లో ఉన్న హీమ్ గ్రూపులో చేరుతుంది. దాని ప్రభావంతో అది చేరినప్పటి నుంచి సాధారణ శ్వాస ప్రక్రియపై ఇది ప్రభావం చూపడం మొదలుపెడుతుంది. సాధారణ శ్వాస ప్రక్రియలో హిమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్‌ను ఊపిరితిత్తుల ద్వారా బయటకు పంపిస్తుంది. ఆక్సిజన్‌ను కూడా రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. హిమోగ్లోబిన్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో శ్వాస సరఫరాలో అంతరాయం ఏర్పడి అవయవాలు వైఫల్యం పొందేలా చేస్తుంది. శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ ను బయటకు పంపించి ఆక్సిజన్ ను అందించే హిమోగ్లోబిన్ ను వైరస్ అడ్డుకుంటుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. రక్తానికి క్రమంగా ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. దీనివలన శరీర అవయవాలకు ఆక్సిజన్ అందక ఫెయిలయ్యే ప్రమాదం ఉంది.
సాధారణంగా ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో ఆక్సిజన్ స్థాయి 95 శాతం వరకు ఉంటుంది. కరోనా సోకితే బాధితుల్లో 60 నుంచి 50 శాతానికి పడిపోతుంది. దీనివలన శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందక అవి పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కరోనా సోకిన చాలామందిలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) వల్ల కాకుండా గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, ఇతరత్రా సమస్యలతో మృతిచెందుతున్నారు. రోగుల శరీరంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. చైనా, యూరోప్ వైద్యుల అధ్యయనాల్లో ఇదే తేలింది.