Begin typing your search above and press return to search.

లైవ్ అప్డేట్: గంటగంటకూ మృత్యు ఘోష

By:  Tupaki Desk   |   30 March 2020 11:04 AM GMT
లైవ్ అప్డేట్: గంటగంటకూ మృత్యు ఘోష
X
ప్రపంచంమంతటా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇంతవరకు ప్రపంచాన్ని గడగడలాడించిన ఏ వైరస్, బ్యాక్టీరియా లేదా ఇంకేదైనా కూడా ఇన్ని దేశాలకు ఒకేసారి వ్యాప్తి చెందలేదు. ఇంతవరకు కనుగొన్న వ్యాధులన్నింటిలో అత్యంత వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి ఇదే. కేవలం ఒకరి నుంచి ఒకరికి సోకేదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ వైరస్ ఉన్న వ్యక్తి ముట్టుకున్న ఏ వస్తువును ముట్టుకున్నా ఇంకొకరికి సోకవడం వల్లే ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇంత వేగంగా వ్యాప్తిచెందింది. కేవలం 4 నెలల్లో ప్రపంచంలో అన్ని ఖండాలకు, అన్ని దేశాలకు విస్తరించింది. మందులేని ఈ వ్యాధిని కేవలం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్జానంతో అవగాహనతో మాత్రమే కొంతవరకు ఇతర మందులు వాడి తగ్గించగలుగుతున్నారు. అందుకే మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అన్ని వ్యాధుల్లోకి బలహీనమైన వ్యాధి ఇదే అయినా... వేగంగా వ్యాప్తి చెందే గుణం వల్ల తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావం ఆరోగ్యం మీద కంటే కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువగా ఉంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా - ప్రపంచ వ్యాప్తంగా ఎంత మంది దీని బారిన పడ్డారు వంటి వివరాలు ఈ క్రింద చూడొచ్చు

ప్రాంతం వ్యాధిసోకిన వారు ఈరోజు కేసులు మరణాలు కోలుకున్నవారు

తెలంగాణ 70 1
ఆంధ్రప్రదేశ్ 23 1
ఇండియా 1071 29 100
ప్రపంచం 7,35,015 34,804 1,56,122