Begin typing your search above and press return to search.
కోరలు చాస్తున్న కరోనా.. 32 లక్షలకు చేరిన కేసులు
By: Tupaki Desk | 30 April 2020 6:30 AM GMTకరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. తన శక్తి రోజు రోజుకు పెంచుకుంటూ మానవాళిని గజగజ వణికిస్తోంది. మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. వైరస్ ధాటికి అన్ని దేశాలు అతలాకుతలమవుతున్నారయి. కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచంలో చోటు చేసుకున్న యుద్ధాల కన్నా తీవ్రంగా ఆ మహమ్మారి ప్రభావం ఉంది. ఈ క్రమంలో ఆ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 32 లక్షలు దాటింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 32,19,240కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో మరణాల సంఖ్య 2, 28,190కి చేరింది. ఈ విధంగా కేసులు, మరణాలు ఉండగా కోలుకున్న వారు 10,00,101 మంది ఉన్నారు. వారంతా ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్లకు చేరారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య 19,90,949. వీరిలో 59,808 రోగుల పరిస్థితి విషమంతా ఉంది.
ప్రపంచంలోనే అత్యధికంగా కరోనాతో తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశం అమెరికా. ఆ దేశంలో కరోనా విజృంభణకు ఇంకా అడ్డు పడలేదు. ప్రపంచంలోని అత్యధికంగా అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది. ఆ దేశంలో ఏకంగా 10,64,194 మంది కరోనా బారిన పడ్డారు. మరణాల్లోనూ ఆ దేశమే ముందుంది. మొత్తం మరణాలు 61,656. అమెరికా తర్వాత స్పెయిన్ - ఇటలీ - ఫ్రాన్స్ - జర్మనీ - బ్రిటన్ - టర్కీ దేశాలు కరోనాతో తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఆ దేశాలతోపాటు భారత్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. భారతదేశంలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ లో 31,787 కరోనా కేసులు నమోదు కాగా, 1,008 మంది కరోనాకు బలవ్వగా - కేవలం 7,797 మంది మాత్రమే కోలుకున్నారు.