Begin typing your search above and press return to search.
మరో వూహాన్ దిశగా అగ్రరాజ్యం అడుగులు..?
By: Tupaki Desk | 25 March 2020 6:50 AM GMTప్రపంచానికి పెద్దన్న. కన్నెర్ర చేస్తే వణికిపోయే పరిస్థితి. ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా అగ్రరాజ్యానికి దాసోహమైపోవాల్సిందే. కాదంటే కఠినచర్యలు ఖాయం. అలాంటి అగ్రరాజ్యం ఇప్పడు కరోనా కార్చిచ్చు ఆ దేశాన్ని కాల్చేస్తుంది. కరోనా కారణంగా చైనా కిందామీదా పడుతున్న వేళ.. పిశాచి వైరస్ ను చైనీస్ పేరుతో ముడిపెట్టి.. పొలిటికల్ మైలేజీ పొందాలన్న ధ్యాసే తప్పించి.. తనను నమ్ముకున్న దేశస్తుల కూడా ఆలోచించని దేశాధ్యక్షుడి తీరుతో ఇప్పుడా దేశం ప్రమాదంలోకి చిక్కుకుపోయింది.
అమెరికాలో ఎంటర్ అయిన కరోనా వైరస్ చాలా వేగంగా మొదటి రెండుస్థాయిలు దాటేసి.. ఇప్పుడు మూడో స్టేజ్ కు చేరిపోయింది. దీంతో.. ఇప్పటివరకూ ఎప్పుడూ చోటు చేసుకోని విపరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఆగ్రరాజ్యం. ఇప్పుడా దేశంలో కరోనా బాధితులసంఖ్య 50వేలకు కాస్త దగ్గరగా చేరుకుంటే.. నిన్న ఒక్కరోజులోనే 130 మంది కరోనా కారణంగా మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కరోనా ప్రారంభం చాలా నెమ్మదిగా ఉన్నా.. స్టేజ్ మారేకొద్దీ స్పీడ్ అంతకంతకూ పెరిగిపోతుంది. మొదటి గేరులో ఉన్నప్పుడు బండి వేగానికి.. గేర్లు మార్చే కొద్దీ అందుకునే స్పీడ్ ఎలా ఉంటుందో?.. అలాంటి పరిస్థితే కరోనా విషయంలోనూ ఉంటుంది. అగ్రారాజ్యంగా.. క్రమశిక్షణకు మారుపేరుగా తమను తాము చెప్పుకునే అమెరికన్లు.. కోవిడ్ దెబ్బకు వారిలోని కొత్త మనుషులు బయటకు వస్తున్నారు.
అమెరికాలాంటి దేశంలో కరోనా కారణంగా ప్రజల్లో పెరిగిన భయాన్ని క్యాష్ చేసుకునేందుకు మాస్కులు.. శానిటైజర్ల ధరల్ని భారీగా పెంచేసే వ్యాపారస్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేయటం చూస్తే.. ఆ దేశానికి మిగిలిన దేశాలకు ఎలాంటి తేడా లేదన్నది అర్థమైపోతుంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తుంటే.. ఆ దేశంలో ప్రధాన మహానగరమైన న్యూయార్క్ పరిస్థితి దారుణంగా మారింది.
మంగళవారం ఒక్కరోజులో న్యూయార్క్ లో ఐదువేలకు పైగా ప్రజలు కరోనా పాజిటివ్ గా తేలిందంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ లో మంగళవారం ఒక్కరోజులోన 43 మంది మరణించారు. మొత్తంగా ఇప్పుడా మహానగరంలో కరోనా పాజిటివ్ కేసులు 25,665కు చేరుకున్నాయి. ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇళ్లల్లో నుంచి బయటకురావటానికి వణికిపోతున్నారు. న్యూయార్క్ మహానగరం ఇప్పుడు చైనా వూహాన్ మాదిరి మారుతుందన్న మాట అందరినోట వినిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రధాన నగరాల్లో వూహాన్ తర్వాత న్యూయార్క్ నగరం నిలుస్తుందన్న మాట వినిపిస్తోంది.
న్యూయార్క్ గవర్నర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మంగళవారం నాటికి న్యూయార్క్ నగరంలో పాజిటివ్ కేసులు25,665కు చేరుకోగా.. వీటిల్లో ప్రధాననగరంలో నమోదైన కేసులు 14,776గా చెబుతున్నారు. ప్రస్తుతం 3324 మంది పేషంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంటే.. ఐసీయూలో 756 మంది పోరాడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ఒక్క న్యూయార్క్ నగరానికే 30వేల వెంటిలేటర్లుఅవసరం ఉందంటున్నారు. ఇప్పటికి ఏడు వేల వెంటిలేటర్లను సమకూర్చుకున్నారు.
మరింత దారుణమైన అంశం ఏమంటే.. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు 53 వేల బెడ్లు అందుబాటులో ఉంటే.. రానున్న కొద్దిరోజుల్లో 1.4లక్షల బెడ్లు అవసరమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. 40వేల ఐసీయూ బెడ్ల అవసరం ఉంది. ఇలాంటివేళ.. న్యూయార్క్ సిటీ భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.