Begin typing your search above and press return to search.

క‌రోనా అప్డేట్‌: తాజాగా ఏపీలో 58 కేసులు.. మొత్తం 1,583

By:  Tupaki Desk   |   3 May 2020 7:01 AM GMT
క‌రోనా అప్డేట్‌: తాజాగా ఏపీలో 58 కేసులు.. మొత్తం 1,583
X
క‌రో్నా వైర‌స్ వ్యాప్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. రోజురోజుకు కేసులు పెద్ద సంఖ్య‌లోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో 58 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.వీటితో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం కేసులు 1,583కి చేరాయి. ఆదివారం ఉద‌యం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది.

తాజాగా న‌మోదైన కేసుల్లో క‌ర్నూలు జిల్లాలో 3 - గుంటూరులో 11 - అనంత‌పురములో 7 - కృష్ణా జిల్లాలో 8 - చిత్తూరు - నెల్లూరు ఒక‌టి చొప్పున ఉన్నాయి. ప్ర‌స్తుతం యాక్టివ్‌ గా ఉన్న కేసులు 1,052 ఉన్నాయ‌ని వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనాతో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 33 మంది మృతి చెందార‌ని తెలిపింది. క‌రోనా వైర‌స్‌ కు చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 488. పాజిటివ్ కేసుల్లో తొలిస్థానంలో క‌ర్నూలు జిల్లా - త‌ర్వాత గుంటూరు జిల్లా ఉండ‌గా - చివ‌రి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉండ‌గా.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క కేసు న‌మోదు కాలేదు.

ఇక జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
క‌ర్నూలు 466
గుంటూరు 319
కృష్ణా 266
నెల్లూరు 91
చిత్తూరు 81
అనంత‌పుర‌ము 78
ప్ర‌కాశం 61
ప‌శ్చిమ గోదావ‌రి 59
తూర్పు గోదావ‌రి 45
విశాఖ‌ప‌ట్ట‌ణం 29
శ్రీకాకుళం 5
విజ‌య‌న‌గ‌రం 0