Begin typing your search above and press return to search.

ఆ నగరంలో కరోనా కష్టాలు మాములుగా లేవుగా !

By:  Tupaki Desk   |   21 April 2020 12:30 PM GMT
ఆ నగరంలో కరోనా కష్టాలు మాములుగా లేవుగా !
X
ఆ నగరం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నగరం. ఒకప్పటి రాజధాని ...ఇప్పుడు కూడా రాజధాని కోసం ప్రాకులాడుతున్న నగరం. విస్తీరణంలో కూడా పెద్దదే. కానీ, కరోనా కష్ట కాలంలో అక్కడి మనుషుల్లో భయం అంతకంతకు పెరిగిపోతోంది. ఒకవైపు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా పేషెంట్లను నిర్లక్ష్యం చేస్తూనే .. ఇంకోవైపు కరోనా కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియలను సైతం అడ్డుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఆ నగరంలో కనిపిస్తుంది. ఇంతకీ ఆ నగరం ఏంటా అని ఆలోచిస్తున్నారా ...కర్నూలు !

కర్నూలు.. కరోనా కష్టకాలంలో ఏపీని భయాందోళనకు గురి చేస్తున్న నాలుగు జిల్లాల్లో కర్నూలు ఒకటి. ప్రస్తుతం రాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు అగ్రస్థానంలో ఉంది. కాగా, కర్నూలు లో ఇప్పటి వరకు కరోనా తో పోరాడి నలుగురు ప్రాణాలు వదిలారు. మరి కొందరి పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. మృతి చెందిన వారిని ఖననం చేయడంలో మునిసిపల్ సిబ్బంది పడుతున్న దయనీయ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏ స్మశాన వాటికకు తీసుకెళ్ళిన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు నిలదీస్తున్నారు.

దీనితో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. బాడీ బర్నింగ్ మిషన్ ఆర్డర్ ఇచ్చిన కూడా తయారు చేసేందుకు తయారీదారులు నెలరోజులు గడువు కోరారు. ఇలాంటి సందర్భంలో జనమంతా అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా శవాలను వెళ్లి ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు వైద్య అధికారులు హామీ ఇస్తున్నప్పటికీ కొందరు చేస్తున్న అభ్యంతరాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.దీనితో కర్నూలు కలెక్టర్, ఎస్పీ కలిసి ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎవరెన్ని చెప్తున్నా కూడా ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం తొలగించలేకపోతున్నారు. దీనితో కరోనా మృతుల అంత్యక్రియలకు కర్నూలులో ఇబ్బందులు తప్పడంలేదు.