Begin typing your search above and press return to search.
ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర ... శ్రీకాకుళం జిల్లాకి కరోనా సెగ !
By: Tupaki Desk | 24 April 2020 9:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకి మరింత వేగంగా విస్తరిస్తుంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ కేవలం శ్రీకాకుళం - విజయనగరం జిల్లాల్లో మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.కానీ , తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒకరికి కరోనా సోకిందనే వార్తలు రావడంతో ఒక్కసారిగా జిల్లా వాసులని షాక్ కు గురిచేసింది.
మార్చి నెలలో ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని, ప్రసార మాధ్యమాల్లో జిల్లాలో తోలి కరోనా కేసు నమోదు అయినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే , ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్ లో మరోసారి పరీక్షించేందుకు ఆ వ్యక్తిని శ్రీకాకుళం తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది.
మార్చి నెలలో ఢిల్లీ నుంచి వచ్చిన అతడు అధికారుల సూచనల మేరకు 14 రోజులపాటు అత్తారింట్లో క్వారంటైన్ లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. అయితే , అతనికి కరోనా నిర్దారణ పరీక్షల్లో కరోనా సస్పెక్టెడ్ అని మాత్రమే వచ్చిందని.. కరోనా నిర్ధారణ కాలేదని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు చెబుతున్నారు. అలాగే , శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్ కు పంపించామని - రిపోర్టులు రావాల్సి ఉందని జిల్లా అధికారులు తెలిపారు. అతడికి భార్య - చిన్న బాబు ఉన్నారు.