Begin typing your search above and press return to search.

తమిళనాడు కరోనాతో కకావికలం

By:  Tupaki Desk   |   6 April 2020 11:10 AM GMT
తమిళనాడు కరోనాతో కకావికలం
X
తమిళనాడు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. ఈ రాష్ట్రం ఇప్పటివరకు కరోనా కేసులు 571కి చేరాయి. అయితే ఆదివారం ఒక్కరోజే కొత్తగా 86 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే వారంతా ఢిల్లీలోని జమాత్‌ ప్రార్థనలకు హాజరైన వారే. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా సోకింది. అయితే ఈ కేసులు అధికంగా చెన్నైలో 95 ఉండగా.. ఆరు జిల్లాలు కరోనా రహితంగా నిలిచినట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 90,824 మంది హోం క్వారంటైన్‌ లో ఉండగా.. 127 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది.

కొత్తగా కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. మొత్తం కరోనా కేసులు 571కి చేరడంతో తమిళనాడులో పడ్బందీగా లాక్ డౌన్‌ అమలు చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం నివారణ చర్యలు ముమ్మరం చేశారు. దేశంలోనే తమిళనాడు లో మాత్రమే అధికంగా కరోనా పరిశోధన కేంద్రాలు ఉండడం తో వెంటనే కరోనా అనుమానితుల వివరాలు సేకరించి వెంటనే ఫలితాలు అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిరంతరం కరోనాపై సమీక్ష చేస్తున్నారు.

రాష్ట్రంలో మూడో దశకు కరోనా కేసులు పెరగకుండా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సహకరించాలని కోరుతున్నారు. కంటైన్‌ మెంట్‌ యాక్టివిటీ ప్లాన్‌ ను చాలా ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు - కరోనా సోకిన వారి ప్రాంతాల్లో - వారు తిరిగిన ప్రాంతాల్లో అత్యావసర చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ముగ్గురు మరణించ గా, ఆదివారం ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య ఐదుకి పెరిగాయి. కరోనా బాధితుల సంఖ్యలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో ఆరు జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉండడం గమనార్హం. వాటిలో తెన్‌ కాశి - ధర్మపురి - మైలాడుదురై - అరియలూరు - కృష్ణగిరి - పుదుక్కోట జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.