Begin typing your search above and press return to search.

తెలంగాణలో 858కి చేరిన కరోనా కేసులు - 4 జిల్లాల్లో ఒక్క కేసూ లేదు

By:  Tupaki Desk   |   19 April 2020 6:11 PM GMT
తెలంగాణలో 858కి చేరిన కరోనా కేసులు - 4 జిల్లాల్లో ఒక్క కేసూ లేదు
X
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ రోజు 49 కేసులు పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. 38 కేసులు జీహెచ్ ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. కరోనాతో ఈ రోజు ముగ్గురు మృతి చెందారు. నేటి వరకు దేశం మొత్తంలో కరోనా కేసులు 15,712కు చేరుకున్నాయి. తెలంగాణలో 858గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 8 రోజుల లోపే కేసులు రెండింతలు అయ్యాయి. తెలంగాణలో 10 రోజుల తర్వాత రెండింతలయ్యాయి. మరణాల రేటు దేశంలో 3.22 శాతం - తెలంగాణలో 2.44 శాతంగా ఉంది. రికవరీ శాతం దేశంలో 14 శాతం - తెలంగాణలో 22 శాతంగా ఉంది. ప్రతి 10 లక్షల మందిలో దేశంలో చూస్తే 254 టెస్టులు జరుగుతున్నాయి. తెలంగాణలో 375గా ఉంది.

తెలంగాణలో మొత్తం కేసులు 858 కాగా - ఇందులో యాక్టివ్ కేసులు 651. డిశ్చార్జ్ అయిన వారు 181 మంది. మరణాలు 21. వరంగల్ రూరల్ - యాదాద్రి భువనగిరి - వనపర్తి - సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,00 ఐజోలేషన్ బెడ్స్ ఉన్నాయి. వెంటిలెటర్స్ కలిగిన బెడ్స్ 564 ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ 1400 ఉన్నాయి.

రాష్ట్రంలో 3.04 లక్షల పీపీఈ కిట్స్ - 3.53 లక్షల N95 మాస్కులు - 36.50 లక్షల 3ప్లై మాస్కులు - 61.119 శాంపిల్ కలెక్షన్ కిట్స్ - 21,366 టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి.

లాక్ డౌన్ సమయంలో 29,991 డెలివరీస్ నిర్వహించారు. 580 మంది తలసేమియా పేషెంట్లు - 5,050 డయాలసిస్ పేషెంట్లు - 1,507 కీమోథెరపీ పేషెంట్స్‌ కు సేవలు అందించారు. జిల్లాల్లో 1,622 మంది - జీహెచ్ ఎంసీ పరిధిలో 183 మంది క్వారంటైన్‌ లో ఉన్నారు. మొత్తం 1818 మంది క్వారంటైన్‌ లో ఉన్నారు.

రాష్ట్రంలో 9 లేబోరేటరీలు ఉన్నాయి. ఇవి రోజుకు 1560 టెస్టులు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 14,962 శాంపిల్స్ సేకరించారు. ఇందులో 858 మందికి పాజిటివ్ వచ్చింది. 14,104 మందికి నెగిటివ్ వచ్చింది. 768 కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. వీటి రిపోర్టులు రావాల్సి ఉంది.