Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మూడు కేసులే‌: తొలిసారి అత్య‌ల్ప కేసులు

By:  Tupaki Desk   |   4 May 2020 4:24 PM GMT
తెలంగాణ‌లో మూడు కేసులే‌: తొలిసారి అత్య‌ల్ప కేసులు
X
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్టు క‌నిపించి మ‌ళ్లీ అమాంతం పెరుతున్నాయి. తాజాగా అత్యల్పంగా కేవ‌లం మూడే కేసులు న‌మోద‌య్యాయి. సోమ‌వారం ఒక్క‌రోజే మూడు కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. వీటితో క‌లిపి మొత్తం కేసులు 1,085కి చేరాయి. ఆ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే న‌మోద‌య్యాయి.

క‌రోనా బారిన ప‌డిన వారు క్ర‌మంగా కోలుకుంటున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్ల‌కు చేరుతున్నారు. తాజాగా సోమవారం ఒక్క‌రోజే 40 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 471 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 585 మంది చికిత్స పొంది ఇళ్ల‌కు చేరార‌ని వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఆ లెక్క‌లు అలా ఉండ‌గా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారు 29 మంది ఉన్నారు.

క‌రోనా కేసులు అతి త‌క్కువ‌గా ఈసారి న‌మోద‌య్యాయి. కేవ‌లం మూడే కావ‌డంతో అధికారులు కొంత హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రంలో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని భావిస్తున్నారు. కేసులు ఈ విధంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని ఆస‌క్తిగా మారింది.