Begin typing your search above and press return to search.
షాకింగ్: కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది
By: Tupaki Desk | 24 March 2020 7:10 AM GMTకరోనా వైరస్....అలియాస్ కోవిడ్ 19 ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోన్న సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాలను హరించే ఈ మహమ్మారి వైరస్...గాల్లో మూడు గంటల పాటు బతికే ఉంటుందని,.... ప్లాస్టిక్ - స్టీల్ వంటి వాటిపై మూడు రోజుల పాటు బతికే ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాణాంతక వైరస్ కార్డుబోర్డుపై 24గంటలు ఉంటుందని - కాపర్(రాగి) పై అయితే కేవలం 4 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని గుర్తించారు. ఇప్పటివరకు గాలి ద్వారా కరోనా దాదాపుగా వ్యాపించదన్న ప్రచారం జరుగుతోంది. అయితే, గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడించింది. ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రతలు - గాలిలో తేమ శాతం వంటి పరిస్థితులను బట్టి గాలిలో ఈ వైరస్ మరింత ఎక్కువ సేపు ఉండే అవకాశముందని - గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చని తెలిపింది. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసిన వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూ హెచ్ ఓ సూచించింది.
గాలి ద్వారా కూడా కరోనా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందగలదని డబ్ల్యూ హెచ్ ఓ అంటోంది. కరోనా వైరస్ కణాలు ఏరోసోల్ బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతాయని తమ తాజా పరిశోధనలో తేలిందని డబ్ల్యూ హెచ్ ఓ చెప్పింది. గాలిలో కరోనా వైరస్ ప్రభావం కోల్పోవటానికి సుమారు 3 గంటలు పడుతుందన్న ప్రచారం ఇప్పటివరకు జరిగిందని - కానీ, ఆయా ప్రాంతాల్లోని తేమ - ఉష్ణోగ్రత వంటి అంశాలను బట్టి అది మరింత ఎక్కువ సమయం ఉండే అవకాశముందని తెలిపింది. నిర్దిష్ట సమయం తర్వాత గాలిలోని వైరస్ కణాల్లో 75 శాతం చనిపోతాయని....కానీ, మిగతా 25శాతం మరికొంత ఎక్కువ సమయం యాక్టివ్ గా ఉండే చాన్స్ ఉందని డబ్ల్యూ హెచ్ ఓ చెబుతోంది. డైమండ్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్ లో గాలి ద్వారానే వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. కరోనా వైరస్ గాల్లో కచ్చితంగా ఎంత సేపు మనుగడ సాగించగలదన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని డబ్ల్యూ హెచ్ ఓ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్స అందించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.