Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్: భారత్ లో లక్షమందికి ఒకేసారి కరోనా పరీక్షలు !
By: Tupaki Desk | 7 April 2020 11:10 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే భారత్ లో కూడా రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఐదువేలకు చేరువలో ఉన్నాయి. దీనితో ప్రభుత్వం లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలనీ భావిస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు మనదేశంలో కరోనా మృతుల సంఖ్య 136 గా ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 4,858 దాటాయి.
ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసులు కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ మెడికల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది.
ఇక దేశంలో ఏ ప్రాంతాల్లో అయితే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా వస్తున్నాయో, ఎక్కడ అయితే కరోనా హాట్ స్పాట్ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయో, అక్కడ ఎక్కువుగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు ప్రతి రోజు సర్వేలు చేయాలని.. అనుమానితులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని రీసెర్స్ మెడికల్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ - ప్రైవేట్ కు చెందిన ల్యాబ్స్ ను - రిసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ - మెడికల్ కాలేజీలను గుర్తిస్తున్నామన్నారు. అలాగే అక్కడ 24 గంటలు కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. కరోనా కోసం పనిచేస్తున్న వారి సంఖ్యను కూడా పెంచాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ... డేటా ఎంట్రీ నుంచి మాన్యువల్ పీసీఆర్ ఆపరేషన్స్ వరకు పనిచేసే వారి సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు.