Begin typing your search above and press return to search.

ఎవ‌రినీ వ‌ద‌ల‌ని క‌రోనా.. ముప్పులో మ‌హారాష్ట్ర‌ - ఢిల్లీ - త‌మిళ‌నాడు

By:  Tupaki Desk   |   24 April 2020 6:50 AM GMT
ఎవ‌రినీ వ‌ద‌ల‌ని క‌రోనా.. ముప్పులో మ‌హారాష్ట్ర‌ - ఢిల్లీ - త‌మిళ‌నాడు
X
క‌రోనా వైర‌స్ భార‌త‌దేశాన్ని వ‌ణికిస్తోంది. లాక్‌ డౌన్ అమ‌లు చేయ‌బట్టి నెల రోజులు పూర్త‌య్యింది. అయినా క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కాక‌పోగా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పుడు 25 వేల‌కు పైగా కేసులు చేరుకోనున్నాయి. కొన్ని ప్ర‌ధాన రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ విల‌య తాండ‌వం చేస్తోంది. దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌ - ఢిల్లీ - త‌మిళ‌నాడు - గుజ‌రాత్‌ - రాజ‌స్థాన్ త‌దిత‌ర రాష్ట్రాల‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా వైర‌స్ దావ‌నంలా వ్యాపిస్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో 6వేల‌కు పైగా కేసులు పెరిగి పోయాయి. రోజు రోజుకు వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌డంతో మ‌హారాష్ట్ర‌లో ప‌రిస్థితులు ఆందోళ‌నక‌రంగా ఉంది. అయితే ఈ క‌రోనా వైర‌స్ ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్యావ‌స‌ర సేవ‌లు అందిస్తున్న వైద్యులు - పోలీసులు - పారిశుద్ధ్య కార్మికులు - జ‌ర్న‌లిస్టుల‌కు కూడా క‌రోనా వైర‌స్ పాకుతోంది.

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. గురువారం మ‌హారాష్ట్ర‌లో 778 కేసులు బయటపడ్డాయి. ఒక్క ముంబై మ‌హాన‌గ‌రంలోనే 478 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసులు ఒక్క ముంబైలోనే 4,232 ఉండగా ఆ రాష్ట్రంలో 6,427కు పెరిగాయి. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావిలో గురువారం 25 మందికి క‌రోనా వైరస్ పాజిటివ్ తేల‌గా మొత్తం 214కు కేసులు చేరాయి.

త‌బ్లిగీ జ‌మాత్‌కు వెళ్లి వ‌చ్చిన వారి వివ‌రాలు సేక‌రణ‌కు వెళ్లిన పోలీసులు క‌రోనా బారిన‌ ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ లో చోటుచేసుకుంది. 34 మంది పోలీసు సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ తేలిది. వారంతా తబ్లీగీ జమాత్‌కు హాజరై భోపాల్‌ తిరిగొచ్చిన వ్యక్తుల కోసం గాలిస్తుండ‌గా కరోనా బారినపడ్డారు. ఆ విధంగా వెళ్లి వ‌చ్చిన సిబ్బంది తో పాటు సైబర్‌ విభాగంలో పనిచేసే ఒక పోలీస్ సిబ్బందికి కరోనా రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మొత్తం పోలీస్ సిబ్బంది 34 మందికి క‌రోనా సోక‌గా వారి కుటుంబ సభ్యులు 30 మందికి కూడా కరోనా సోకింది. దీంతో మొత్తం 64మంది పోలీస్ సిబ్బందితో పాటు వారికి సంబంధించిన వారికి వైరస్ సోక‌డం క‌ల‌వ‌రం రేపింది. దీంతో ప్ర‌స్తుతం విధుల్లో ఉన్న పోలీస్ ఉద్యోగులంతా విధులు ముగిశాక ఇంటికి వెళ్లడం లేదు. ఈ సంద‌ర్భంగా వారికి ప్ర‌త్యేక వ‌స‌తి, భోజ‌న సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు.

క‌రోనా వైర‌స్‌తో ఎలాంటి సంబంధం లేని వైద్యుడికి కూడా క‌రోనా సోక‌డం విచిత్రంగా ఉంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) అనుబంధ జవహర్‌ లాల్‌ నెహ్రూ వైద్య కళాశాలలో ఒక సర్జన్‌ కు కరోనా వైరస్ అని తేలింది. ఆమె క‌రోనా వైర‌స్ సంబంధించి ఎలాంటి విధులు నిర్వ‌హించ‌డం లేదు. మూడు రోజుల కిందట ఓ రోగికి ఆయన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ సమయంలో అత‌డికి వైరస్‌ సోకిందని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యం లో అత‌డిని ఆస్ప‌త్రికి పంప‌గా అత‌డితో పాటు విధులు నిర్వ‌హిస్తున్న 20 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని క్వారంటైన్‌కు పంపారు.