Begin typing your search above and press return to search.

షాకింగ్: కరోనా ఎండ్ 2022 అంట

By:  Tupaki Desk   |   15 April 2020 11:10 AM GMT
షాకింగ్: కరోనా ఎండ్ 2022 అంట
X
లాక్ డౌన్ ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయలేమని తాజాగా ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. దీని తీవ్రత ఏకంగా 2022 సంవత్సరం వరకూ ఉంటుందని బాంబు పేల్చారు. 2022 సంవత్సరం వరకూ భౌతిక దూరం పాటించేలా పటిష్ట చర్యలు చేపడితేనే ప్రాణంతక వైరస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

అమెరికాలో కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న నేపథ్యంలో హార్వర్డ్ శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం చేపట్టారు. జలుబు మాదిరిగా కరోనా వైరస్ సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ దీని తీవ్రత పెరుగుతుందని.. చలికాలం తట్టుకోలేమని వీరు స్పష్టం చేశారు.

వ్యాధి నిరోధానికి తరచూ కరోనా పరీక్షలు చేయడం.. భౌతిక దూరం పాటించడం.. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ ను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. కరోనాను అంతం చేసే ఆయుధం వ్యాక్సిన్ అని.. దాన్ని తయారు చేసేందుకు సమయం పట్టవచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు.

కరోనాను జయించిన వారికి మళ్లీ కరోనా రావడం.. కోలుకున్న వారికి తిరగబడడం చూస్తే 2022 వరకు కరోనా తగ్గే అవకాశం కనిపించడం లేదని హార్వర్డ్ పరిశోధకులు సంచలన విషయాలను వెల్లడించారు.