Begin typing your search above and press return to search.

నవంబరులో ప్రళయం!

By:  Tupaki Desk   |   15 April 2020 2:30 AM GMT
నవంబరులో ప్రళయం!
X
ప్రపంచంలో కరోనా ప్రళయం చూస్తున్నాం. దాని విలయతాండవంలో ఎన్నో ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అమెరికా - యూరప్ దేశాలు కరోనా వైరస్ తో విలవిల్లాడుతుంటే ఆసియా కొంచెం సేఫ్ గా ఉంది. తీవ్రత తక్కువగా ఉన్నా దాని ప్రభావం మాత్రం ఆసియాలోని అన్ని దేశాల్లో ఉంది. అయితే, యూరప్ అమెరికాల కంటే తీవ్రత తక్కువగా ఉంది. అయితే... చైనా వాళ్లు ఇపుడు మనల్ని భయపెడుతున్నారట. మనకు నవంబరు తర్వాత ముప్పు తప్పదు అని చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో కరోనా వైరస్ విజృంభిస్తుందని అందుకే ఆసియా ఖండంలో దీని తీవ్రత తక్కువని... కానీ నవంబరు లోపు ఇండియా నుంచి కనుక దీనిని తరిమేయకపోతే ఆ సమయంలో దీని తీవ్రతను తట్టుకోలేం అని చైనా భయపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇది శాస్త్రీయంగా ఎంత నిజమో తెలియకపోయినా ఈ వార్త అయితే గట్టిగా చక్కర్లు కొడుతోంది. అమెరికాలోని ఎంఐటీ యూనివర్సిటీ 4-18 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని ఇటీవలే పరిశోధనలో తేల్చారు. ఇది కొంతవరకు నిజమే అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేసులను చూస్తే అర్థమవుతుంది. అయితే, చలికాలం వచ్చినా కూడా సామాజిక దూరం - వ్యక్తిగత పరిశుభ్రత - మాస్కు ధరించడం వంటి వాటితో ఎపుడైనా కూడా దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చని అంటున్నారు.

ఇక నవంబరు నుంచి జనవరి మధ్య దేశంలో అత్యధిక ప్రాంతాలు మన దేశంలో చల్లగా ఉంటాయి. ఉత్తరాదిన సున్నా డిగ్రీలు - అంతకంటే తక్కువకు కూడా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయి. దక్షిణ భారతదేశంలోను రాత్రి పూట ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీలకు పడిపోతాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు 16-25 వరకు ఉంటాయి. కాబట్టి చలికాలంలో ఇది ఇక్కడ కొనసాగితే కచ్చితంగా కొంచెం ప్రమాదం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది.

అయితే అన్ని రోజులు ఇండియాలో ఇది కంట్రోల్ కాకపోతే మనం దీని బారిన పడటం కంటే ముందే ఎకానమీ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆవిధంగా మనం కరోనా కంటే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగంతో దెబ్బతినే అవకాశమే ఎక్కువ.