Begin typing your search above and press return to search.
కరోనా: ప్రపంచవ్యాప్తంగా 38వేల మంది మృతి
By: Tupaki Desk | 31 March 2020 6:10 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వినిపిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఏకంగా మరణాల సంఖ్య 38వేలు దాటింది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 66వేల మంది వైరస్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 7.85 లక్షలకు దాటింది. గడిచిన 24 గంటల్లోనే మరో 3వేల మంది మృతిచెందారు. ఈ మరణాల్లో 70శాతం ఐరోపా దేశాల్లోనే ఉండడం గమనార్హం.
అగ్రరాజ్యం అమెరికాలో కరానా విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్ న్యూయార్క్, న్యూజెర్సీలలో తీవ్రంగా ఉంది. అక్కడ ఇళ్లలోంచి జనం బయటకు రావడం లేదు. కరోనాతో న్యూయార్క్ లోనే 1400మంది ప్రాణాలు కోల్పోయారు. 70వేల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఇటలీ దేశంలో ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. మరణాల సంఖ్య 11500 దాటింది. సోమవారం 850మంది చనిపోయారు. కరోనా తో భారీగా మరణాలు ఇటలీ దేశంలో సంభవిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందిన వారి సంఖ్య 101739కు చేరింది.
*ఇక చైనాలో మరో ఆరుగురు చనిపోగా.. 79 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3309కు చేరింది. బాధితుల సంఖ్య 81వేలు దాటింది.
* ప్రపంచంలోనే కరోనా మరణాల్లో స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 7716మంది చనిపోయారు. సోమవారం 700మంది మృతి చెందారు. స్పెయిన్ లో 87956మందికి కరోనా పాజిటివ్ సోకింది.
**ఫ్రాన్స్ లో 3వేల మందికిపైగా బలయ్యారు. సోమవారం 400 మంది చనిపోయారు. కొత్తగా 4వేల మందికి కరోనా పాజిటివ్ తేలింది.
*జర్మనీలో తీవ్రత అధికంగా ఉంది. సోమవారం 9వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. కరోనా రోగుల సంఖ్య 67వేలు దాటింది. సోమవారం 100 మంది చనిపోయారు.
*ఇరాన్ లో 2757, బ్రిటన్ లో 1408, నెదర్లాండ్ లో 864, స్విట్జర్లాండ్ లో 359 మంది, బెల్జియంలో 513 మంది చనిపోయారు. టర్కీలో 10వేల కేసులు నమోదయ్యాయి. 168మంది చనిపోయారు. బ్రిటన్ లో 22వేలకు కరోనా కేసులు చేరాయి.