Begin typing your search above and press return to search.
పెరుగుతున్న కార్పొరేట్ బ్యాంకుల ఏర్పాటు వివాదం
By: Tupaki Desk | 3 Dec 2020 4:30 AM GMTకొర్పారేట్ రంగానికి చెందిన కంపెనీలు సొంతంగా బ్యాంకులు ఏర్పాటు చేసుకునే అంశంపై వివాదాలు పెరిగిపోతున్నాయి. దేశంలోని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్ధలు సొంతంగా బ్యాంకులను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తరపున ఇంటర్నల్ వర్కింగ్ గ్రూపు సూచించింది. గ్రూపు సూచనలు వెలుగు చూడగనే ప్లస్సులు, మైనస్సులను ప్రస్తావిస్తు పెద్ద ఎత్తున చర్చలు, వివాదాలు పెరిగిపోతున్నాయి.
తాజాగా గ్రూపు చేసిన సూచనను గనుక ఆమోదం లభిస్తే అంబానీ, అదాని, పిరమల్, టాటా, బిర్లా లాంటి ప్రముఖ కార్పొరేట్ సంస్దలన్నీ దేనికదే ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రైవేటు, పబ్లిక్ బ్యాంకుల పనితీరుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దేశంలో గడచిన పదేళ్ళల్లో దివాలా తీసిన బ్యాంకుల్లో ఎక్కువగా ప్రైవేటు బ్యాంకులే అంటు కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేట్ సంస్ధలకే బ్యాంకులు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తే బ్యాంకులోని డబ్బంతా సదరు యాజమాన్యాలు తమ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకునే ప్రమాదం ఉందంటు హెచ్చరిస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ మాట్లాడుతు ఇదే ఆందోళన వెలిబుచ్చారు. బ్యాంకు యాజమాన్యాలు+కార్పొరేట్ యాజమాన్యాలు ఒకటే అయితే అథికార దుర్వినియోగానికి అంతు ఉండదంటూ తీవ్రంగా హెచ్చరించారు. కార్పొరేట్ సంస్దలకే బ్యాంకులు ప్రారంభించేందుకు అనుమతించేందుకు అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్పారు.
దేశంలో బ్యాంకుల అవసరం చాలానే ఉన్నప్పటికీ ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన ప్రైవేటు బ్యాంకుల వ్యవహారాలను రాజన్ గుర్తుచేశారు. ఆర్బీఐ గవర్నర్ కూడా పనిచేసిన రాజన్ వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు, అనుమానాలు, హెచ్చరికలను ప్రభుత్వం పట్టంచుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.