Begin typing your search above and press return to search.
కార్పొరేట్ కంపెనీల నయా ట్రెండ్: వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. హోటల్
By: Tupaki Desk | 8 July 2020 2:30 AM GMTవైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. సాధ్యమైనంత ఉద్యోగులు.. కంపెనీ ఆరోగ్యం బాగుండేలా చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వీలైనంత ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలుచేస్తున్నాయి. ఇళ్ల నుంచే పని అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కార్పొరేట్ కంపెనీలు పంథా మార్చాయి. ఉద్యోగుల సేవల్లో నాణ్యత.. నిర్లక్ష్యం వంటివి ఉన్నాయని గుర్తించి వారి నుంచి ఉత్తమ సేవలు పొందేందుకు కార్పొరేట్ కంపెనీలు ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. తమకు ఉత్తమ సేవలు అందించేందుకు ఇప్పుడు ఉద్యోగులను ఏకంగా స్టార్ హోటళ్లకు తరలిస్తున్నాయి.
పలు ఐటీ, బీపీఓ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా వర్క్ ఫ్రమ్ హోటల్ గా మారుస్తున్నాయి. కంపెనీలో సీనియర్ ఉద్యోగులుగా ఉన్నవారిని పలు త్రీస్టార్..ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఉంచి పని చేయిస్తున్నాయి. కీలక ఉద్యో గులు, ఆయా కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, బిజినెస్ హెడ్‌ల కోసం వర్క్ ఫ్రం హోటల్ కాన్సెప్ట్ అమలుచేస్తున్నాయి.
ఇప్పటికే వైరస్ ప్రభావంతో హోటళ్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. పర్యాటకులు.. వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చేవారు తగ్గిపోయారు. దీంతో హోటల్ రంగం తీవ్రంగా నష్టపోయింది. దేశ, విదేశీ అతిథుల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో హోటల్ రంగం ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త తరహా ఆలోచనలతో పలు త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లు వర్క్ ఫ్రం హోటల్ కాన్సెప్ట్‌తో కార్పొరేట్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
కార్పొరేట్ల అవసరాలకు తగినట్లుగా... వీడియో కాన్ఫరెన్స్‌లు, బోర్డు మీటింగ్‌లు, నూతన ప్రాజెక్ట్‌ల సదస్సులు, సమావేశాల నిర్వహణకు వీలుగా హోటళ్లల్లో మార్పులు చేస్తున్నాయి. వారి అవసరాలకు అనుగుణంగా వైఫై, ప్రింటర్, వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలతోపాటు రుచికరంతో పాటు హాట్‌హాట్‌గా బాక్స్‌మీల్స్, స్నాక్స్, బేవరేజెస్‌ను అందిస్తున్నాయి. ఆయా హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు, అతిథుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చూడటం, శానిటైజేషన్ ప్రక్రియను కూడా చేస్తున్నాయి. థర్మల్ స్క్రీనింగ్, ప్రతిచోట శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కాన్సెప్ట్‌కు కార్పొరేట్ కంపెనీలకు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రోజులు.. గంటలు.. నెలల చొప్పున రూ.లక్ష నుంచి 25 లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ట్రెండ్ హైదరాబాద్‌లోని సోమాజిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ , మాదాపూర్ సహా శివార్లలోని శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు కొనసాగిస్తున్నాయి. ఐటీ, బీపీఓ కంపెనీలతోపాటు ఫైనాన్స్, బీమా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నిర్మాణ రంగం, రియల్టీ తదితర రంగాలకు చెందిన బడా సంస్థలు ఈ విధానానికి ముచ్చట పడి వినియోగించుకుంటున్నాయి.