Begin typing your search above and press return to search.
కవిత పోరాటానికి కార్పొరేట్ లు చెక్ పెడతారా?
By: Tupaki Desk | 12 April 2016 3:59 AM GMTమన దేశంలో బీడీ పరిశ్రమ విస్తారంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. ఇప్పుడు కేంద్రం విధించిన కొత్త ఆదేశాల నేపథ్యంలో బీడీ పరిశ్రమ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోంది. అంటే.. పొగాకు ఉత్పత్తుల మీద హెచ్చరికల బొమ్మలను 85 పర్సంటు ఉండేలా విధిగా ముద్రించాల్సిందేనంటూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఇది బీడీ పరిశ్రమను నాశనం చేసేస్తుందంటూ ఒక వాదన మొదలైంది. తెరాస ఎంపీ కవిత కూడా ఈ విషయంలో బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రమంత్రుల్ని పలుమార్లు కలిసి బీడీ కట్టల మీద బొమ్మల సైజును తగ్గించేలా తిరిగి ఉత్తర్వులు ఇవ్వాలంటూ వినతులు ఇచ్చారు. ఈ విషయంపై బీడీకార్మికుల కోసం ఆమె సీరియస్ గానే పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత పోరాటానికి మరో ప్రమాదం ఎదురవుతోంది. కవిత, అదేమాదిరిగా బీడీ కార్మికులకోసం మరికొందరు ప్రజాప్రతనిధులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే గనుక.. ఆటోమేటిగ్గా అది సిగరెట్ వ్యాపారాన్ని ఎంతో కొంత దెబ్బతీస్తుంది. అందుకే కాబోలు సిగరెట్ కంపెనీలు - రైతుల ముసుగులో ఇప్పుడు కొత్త పోరాటాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిగరెట్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి మానివేసి మూతపెట్టి కూర్చున్నాయి. పొగాకు రైతులనుంచి క్రయవిక్రయాలు స్తంభించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
తాజాగా రైతుల ముసుగులో.. ఈ 85 పర్సంటు బొమ్మ వల్ల పొగాకు రైతుల జీవితాలు మునిగిపోతాయని అంటూ... రైతుల పేరిట కొత్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పుడు సిగరెట్ పెట్టెల మీద కూడా బొమ్మ తగ్గించాలనే డిమాండ్ వస్తే గనుక.. ప్రభుత్వం సీరియస్ అయి ఎటూ కాకుండా పోతుందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతోంది. దీనివల్ల ఎపీ కవిత వంటి వారు చేస్తున్న పోరాటానికి కూడా విలువ లేకుండా పోతుంది. ఒకవేళ అందరికీ బొమ్మ తగ్గించేస్తే కూడా.. ప్రత్యేకంగా బీడీ పరిశ్రమకు ఒనగూరే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రస్తుతం తెరాస ఎంపీ కవిత సాగిస్తున్న బీడీ కార్మికుల తరఫు పోరాటానికి సిగరెట్ కంపెనీల కార్పొరేట్ శక్తులు చెక్ పెడుతున్నాయేమో అనే అభిప్రాయం కలుగుతోంది.