Begin typing your search above and press return to search.
కరోనా పేరుతో కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్ ఆసుపత్రులు !
By: Tupaki Desk | 6 Aug 2020 11:50 AM GMTకరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరులో ఏ మార్పు రావడంలేదు. వైరస్ తో రోగులు వణికిపోతుండగా.. ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులు చూసి వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వ హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా అడుగులు ముందుకువేస్తున్నాయి. ఇలా అడ్డగోలుగా ఫీజులు రాబడుతున్నాయని , రెండు ఆస్పత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరికలు జారీ చేసినా కార్పొరేట్ ఆస్పత్రుల వైఖరిలో పెద్దగా మార్పు రావడం లేదు. బుధవారం ప్రైవేటు ఆస్పత్రులపై కొత్తగా మరో 24 ఫిర్యాదులు వైద్య ఆరోగ్యశాఖకు అందాయి. ఇప్పటివరకు మొత్తం 951 ఫిర్యాదులు వచ్చాయి.
ఆర్టీపీసీఆర్ కు రూ.2200 ధర నిర్ణయించింది. నిజానికి ఆర్టీపీసీఆర్ తో పోలీస్తే.. ర్యాపిడ్ టెస్టు చాలా సులువు. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చుతో రిపోర్ట్ వచ్చేస్తుంది. చెస్ట్ ఎక్సరే లో కూడా కోవిడ్ ఉందో లేదో తెలిసిపోతుంది. కానీ నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోకుండా అవసరం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న వారందరికీ కోవిడ్ నిర్ధారణ పేరుతో అడ్మిషన్‌కు ముందే సీటీస్కాన్ లు సిఫార్సు చేస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి రూ.6500 నుంచి రూ.10 వేల వరకు ఛార్జీ చేస్తుంది. రోగులను నిలువు దోపిడికి గురిచేస్తున్న ఈ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖకు ఇప్పటికే వెయ్యికిపైగా ఫిర్యాదులు అందాయి.
మార్చికి ముందు గాంధీలో రోజుకు 200 నుంచి 250 సర్జరీలు జరిగేవి. ఉస్మానియాలో 150 నుంచి 200 సర్జరీలు జరిగేవి, కింగ్ కోఠిలో రోజుకు 10 నుంచి 20 చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మారాయి.దీనితో మరో గత్యంతరం లేక , రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నిజానికి కోవిడ్ కు ముందు వరకు జాయింట్ రీప్లేస్ మెంట్, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, గుండె చికిత్సలకు పలు ప్యాకేజీల కింద సర్జరీలు చేసేవి. ప్రస్తుతం కోవిడ్ ను చూపించి ఆయా సర్జరీల ధరలను రెట్టింపు చేశాయి. సాధారణ చికిత్సలకు కూడా రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకు ఛార్జీ చేస్తున్నాయి.ప్రైవేటు ఆస్పత్రులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం వాటిపై విచారణ జరుపుతోంది. కొన్ని ప్రముఖ ఆస్పత్రులకు కూడా నోటీసులు అందాయి. దీంతో ఆస్పత్రుల యాజమాన్యాలు పైరవీలు ప్రారంభించాయి. తమపై చర్యలు చేపట్టకుండా వైద్య ఆరోగ్యశాఖలో కీలక వ్యక్తులతో లాబీయింగ్ నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.