Begin typing your search above and press return to search.
ఆ కార్పొరేట్ స్కూల్లో తమ్మినా ఫైన్
By: Tupaki Desk | 15 Nov 2017 7:27 AM GMTకార్పొరేట్ స్కూళ్లలో రూల్ బుక్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇస్టం వచ్చినట్లుగా రూల్స్ ను ఫ్రేమ్ చేసేయటం.. వాటిని అమలు చేయటం కార్పొరేట్ స్కూళ్లకు అలవాటే. తాజాగా తమిళనాడులోని ఒక కార్పొరేట్ స్కూల్ వేస్తున్న ఫైన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సెట్టి పాళయంలోని ఒక కొర్పారేట్ స్కూల్ రూల్స్ వింటే అవాక్కు కావాల్సిందే. స్కూల్లో తుమ్మితే తమ పీటీ మాష్టారు తమపై రూ.200 జరిమానా విధిస్తున్న వైనం బయటకు వచ్చింది. అంతేనా.. స్కూల్లో తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్న వైనం వెల్లడైంది.
తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె లక్ష్మీని స్కూల్లో వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూల్లో నిబంధనలు దారుణంగా ఉన్నట్లుగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్కూల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు తుమ్మితే జరిమానా విధించటంతో పాటు.. స్కూల్ గ్రౌండ్ లో పరిగెత్తాలన్న రూల్‌ను పెట్టారు.
అదే సమయంలో తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధించటంతో పాటు స్కూల్ టాయిలెట్లను కడిగిస్తున్న దారుణం బయటకు వచచింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే స్కూల్ మైదానంలో పదిసార్లు పరుగు పెట్టాల్సి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
విద్యార్థులు ఇంట్లో నుంచి తెచ్చుకుంటున్న వాటర్ తాగొద్దంటున్నారని.. మురికిగా ఉన్న స్కూల్ ట్యాంకర్ నీళ్లనే వాడాలని రూల్ పెట్టారని.. స్కూల్ వద్దంటూ టీసీ ఇవ్వాలని కోరితే రూ.15వేలు కట్టాలని డిమాండ్ చేస్తున్నట్లుగా పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ స్కూల్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరపాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.