Begin typing your search above and press return to search.
యమునా నదిలో కరోనా బాధితుల శవాలు.. అధికారుల అప్రమత్తం !
By: Tupaki Desk | 10 May 2021 11:38 AM GMTకరోనా వైరస్ సోకినప్పటి నుండి తిరిగి మళ్లీ కోలుకునే వరకు , లేకపోతే కరోనా కాటుకి బలైతే ఆ శవానికి అంత్యక్రియలు చేసేవరకు ఆ కుటుంబ సభ్యులు అనుభవించే భాద అంతా ఇంతా కాదు. స్మశానాల్లో స్థలం లేక అంత్యక్రియల కోసం లైన్ లో నిల్చొని ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంతలా దిగజారిందో. దేశంలో సెకండ్ వేవ్ గంట గంటకి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మృత్యువాత పడే వారు కూడా పెరిగిపోతున్నారు. దీనితో ఎక్కడ చూసినా కూడా శవాలు కుప్పలు , కుప్పలుగా పడి ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే ..యమునా నదిలో డజనుకుపైగా మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. ఆ శవాలని స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం యూపీ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పై వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామంలో కరోనాతో చాలా మంది చనిపోతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానం సరిపోవట్లేదని, దీంతో శవాలను ఇలా నదిలో పడేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు వచ్చి నదిలో ఉన్న శవాలను పరిశీలించారని, నదిలోనే వారి శవాలను డిస్పోజ్ చేయాలని నిర్ణయించారని అంటున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో యమునా నది ఒడ్డునే కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆ మరణాలు లెక్కలోకి కూడా రావట్లేదు.
ఇటు జిల్లా అధికారులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు చెబుతున్నారు. యమునా నది పవిత్రమైనదిగా స్థానికులు భావిస్తుంటారని, అందుకే నదిలో మృతదేహాలను ఖననం చేస్తుండవచ్చని హామీర్ పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ చెప్పారు. అప్పుడప్పుడు ఒకట్రెండు మృతదేహాలు నదిలో కనిపిస్తుంటాయని, కానీ, ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో మృతదేహాలు తేలియాడుతున్నాయని అన్నారు. ఇలా ఉండగా ఈ రెండు జిల్లాల గ్ఫ్రామాల్లోని తాజా పరిస్థితిని అంచనా వేసిన అధికారులు అప్రమత్తమై ఈ గ్రామాల్లో శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. కోవిడ్ తో మరణించిన వారి వివరాలు ఇవ్వాలని గ్రామస్థులను కోరుతున్నారు.