Begin typing your search above and press return to search.

మీడియా చూస్తుండగా కిమ్ దారుణం.?

By:  Tupaki Desk   |   13 Sep 2018 12:45 PM GMT
మీడియా చూస్తుండగా కిమ్ దారుణం.?
X
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నరహంతకుడిని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అసమ్మతి వాదులను పెద్ద ఎత్తున చంపించాడని.. తనకు పోటీగా ఉన్న కుటుంబసభ్యులను కూడా హత్య చేయించాడని పేరు పొందాడు. కానీ ఇటీవల కిమ్ మారాడు. దాదాపు 65 ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరానికి తెరదించాడు. తమ తమ ప్రతినిధి బృందాలతో కలిసి ఉతర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో సరిహద్దుల్లో సమావేశమై ఇక నుంచి అణు నిరాయుధీకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని.. కొరియా భూభాగంలో చిరకాల శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తామని ఇద్దరూ కలిసి ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఇరు దేశాల సరిహద్దుల్లోని భూభాగాల మధ్యన నిలబడి ఇద్దరు దేశాధినేతల వారి వారి భూభాగాల్లోకి రమ్మని ఆహ్వానించి తాము కలిసిపోయామని మీడియా ఎదుట చూపించారు. ఈ ఫొటోలు - వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. కొరియా సరిహద్దుల్లో ఇద్దరు దేశాధినేతలు ఇలా ఒకరి భూభాగంలోకి ఒకరు వెళ్లడంతో కొరియన్లు సంబరాలు చేసుకున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇటీవలే అమెరికా అధ్యక్షుడితో సింగపూర్ లో సమావేశమై శాంతి చర్చలు జరిపారు.దీని తర్వాత. ఇప్పుడు కొరియా దేశాల మధ్య సహృద్భావం వాతావరణం నెలకొంది.

అయితే ఫన్ మూమెంట్స్ అనే ఓ సెటైరికల్ యూట్యూబ్ చానెల్ ఓ వీడియోను క్రియేటివిటీగా రూపొందించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తో కరచాలనం చేసిన ఓ వ్యక్తి ఓ గుంతలో పడిపోయి.. వెంటనే డోర్లు మూసుకుపోయి మరణిస్తాడు. అనంతరం కిమ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. కిమ్ ఎంత క్రూరంగా ఓ అధికారిని చంపేశాడనేలా ఫన్ మూమెంట్ ఈ వీడియోను రూపొందించింది. ఈ 12 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి అది ఫేక్ వీడియో.. దక్షిణకొరియా అధ్యక్షుడు.. ఉత్తర కొరియా అధినేతతో కరచాలనం చేసిన వీడియోను మార్ఫింగ్ చేసి ఇలా కిమ్ చంపేశాడనట్టు రూపొందించారు. దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ కావడంతో ఇదంతా ఫేక్ అని ఉత్తరకొరియా అధికారులు అసలు వీడియోను విడుదల చేస్తూ తమ అధినేత మంచోడని వివరణ ఇస్తున్నారు.